
Missed train accident : రైలు ప్రమాదం మాట వింటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. ఇప్పటి వరకు చాలా రైలు ప్రమాదాలను చూసిన భారత్ కోరమండల్ ట్రైన్ ప్రమాదాన్ని మరోలా చూస్తోంది. ఈ ట్రైన్ గత 15 సంవత్సరాల్లో రెండో సారి ప్రమాదానికి గురైంది. గతంలో కంటే ఈ సారి మృతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపు ఇప్పటికే (IST 2.00 PM) వరకే 278 మంది వరకూ మృత్యువాత పడ్డట్లు అధికారులు ప్రకటించారు.
భారత్ లో గత పదేళ్లలో అతిపెద్ద రైలు ప్రమాదంగా కూడా కోరమాండల్ ఘటనను చూడవచ్చు. గతంలో ఇదే ట్రైన్ కు ప్రమాదం జరిగినప్పడు 16 మంది చనిపోయారు. ఇప్పుడు మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనిపై ప్రధాని మోడీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాధ స్థలానికి వెళ్లి పరిశీలించనున్నారు మోడీ. రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ ఈ ప్రమాదం గురించి కారణాలను ఇప్పుడే చెప్పలేమన్నాడు.
ఇది ఇలా ఉండగా ఏపీలో మరో రైలు ప్రమాదం జరగకుండా రైల్వే ఉద్యోగి ఆపగలిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక వైపు కోరమాండల్ ప్రమాదం తెలిసినా రైల్వే గేట్ మ్యన్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కదిరి పట్టణంలోని కుటాగుల్ల వద్ద రైల్వే గేట్ ఉంది. అయితే ఈ గేట్ వైపుగా రైల్ వస్తున్నా గేట్ మ్యాన్ స్పందించలేదు. గేట్ వేయలేదు. దీన్ని గమనించిన రైల్వే ఉద్యోగి హుటాహుటిన రైలును ఆపివేశాడు. దీంతో ఎన్నో ప్రాణాలు పోకుండా కాపాడాడు. అతని నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారు.






