ఢిల్లీ వెళ్లే ముందు తండ్రి కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడింది కవిత. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , న్యాయపరంగా పోరాటం చేద్దామని పార్టీ , ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని భరోసా నిచ్చారు కేసీఆర్. దాంతో ఢిల్లీ కి బయలుదేరింది కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో రేపటి విచారణ కోసమే కవిత ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈనెల 10 న ఢిల్లీ లో జంతర్ మంతర్ వద్ద దీక్ష కు దిగుతోంది కవిత. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ ధర్నా చేపట్టనుంది కవిత. దాంతో ఢిల్లీ వెళ్లాలని ప్రయాణానికి సిద్ధమైంది. ఈలోగానే మార్చి 9 న విచారణకు హాజరు కావాల్సిందిగా కవితకు నోటీసులు ఇచ్చింది ఈడీ.
అయితే తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున ఈనెల 15 న విచారణకు హాజరు అవుతానని ఈడీకి లేఖ రాసింది. అయితే ఆ లేఖ పై ఈడీ అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఢిల్లీకి వెళ్ళింది. అయితే కవిత ఢిల్లీ పర్యటన ఈడీ విచారణ కోసమేనా ? లేక ధర్నా కోసమా ? అన్నది రేపు తెలియనుంది.