
YCP MLC : వైసిపికి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి బీసీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. నిన్న ఆయన టిడిపి అధినేత చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే. త్వర లోనే గురజాలలో జరిగే శంఖారావం సభలో టిడిపిలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.
కాగా గురజాల వైసీపీ టికెట్ కోసం నిజంగా ప్రయ త్నించగా కాసు మహేష్ రెడ్డికి జగన్ టికెట్ కేటా యించారు. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీటు దక్కని వారు ఇత ర పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా వైసిపి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీని వీడారు.