30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Modi achieved : తొమ్మిదేళ్ల పాలనలో మోదీ చేసిందేమిటి..! సాధించింది ఏంటి!

    Date:

    Modi achieved
    Modi achieved

    Modi achieved : ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు గడిచింది. ఈ సమయంలో ఆయన దేశం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ పై నిషేధం వంటి నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. ప్రజా సంక్షేమ పాలన అందించడంలో, దేశ రక్షణకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కడా రాజీ పడలేదు.

    మోడీ ప్రభుత్వం గత తొమ్మిది ఏళ్లలో రక్షణ పరంగా బడ్జెట్ ను పెంచుకుంటూ వెళ్లింది. రక్షణ రంగంలో ఆధునికతకు పెద్ద పీట వేసింది. పరిశోధన రంగానికి కూడా చేయూతనందించింది. విదేశాల నుంచి దిగుమతులను తగ్గించుకొని స్వదేశంలోనే రక్షణ పరికరాల తయారీపై మేకిన్ ఇండియా ద్వారా మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రక్షణ రంగంలో ఆయుధాల తయారీకి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు విదేశీ ప్రత్యక్ష  పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేసింది.  దీంతోపాటు సాయుధ బలగాల ఆధునీకరణకు ప్రత్యేకంగా కృషి చేసింది ఫైటర్ జెట్లు,  జలాంతర్గాములు, ఫిరంగి వ్యవస్థలు, హెలికాప్టర్లు యుద్ధ విమానాలు.. ఇలా ఎన్నో రక్షణ ఒప్పందాలు కొనుగోళ్లను చేపట్టింది.

    దీంతోపాటు ఇతర దేశాల సైనికులతో సహకార సైనిక విన్యాసాలు, రక్షణ సంభాషణలు, సాంకేతికత బదిలీ లాంటి ఎన్నో సంబంధాలను బలోపేతం చేసుకుంది, దేశ సరిహద్దు ప్రాంతంలో నిఘాను కట్టు దిట్టం చేయడంతో పాటు అవసరమైన బలగాలను ఆయా చోట్ల మోహరించింది. భారత చైనా, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంట సున్నితమైన ప్రాంతాల్లో తగిన నిఘాను పెట్టింది. సాంకేతికతను రక్షణ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ముఖ్యంగా డీఆర్డిఓ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి సారించింది. దేశ రక్షణ రంగంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని మోడీ పదేపదే చెప్పుకొచ్చారు. అదే చేసి చూపిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : ప్రధాని మోదీతో సతీసమేతంగా మంత్రి నారా లోకేష్ భేటీ

    Nara Lokesh Meet PM Modi : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

    Swami Sivananda : ప్రసిద్ధ యోగా గురువు స్వామి శివానంద కన్నుమూతపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగం

    Swami Sivananda : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి...

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    PM Modi : ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు

    PM Modi : మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని...