
Modi counter Pakistan : ఇక ఉగ్రవాదంపై ఉక్కుపాదం తప్పదని భారత ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి నుంచే పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రస్తుతం ఇండియా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా మారుతోందని చెప్పారు. ఈ సందర్భంగా 9/11, 26/11 దాడులను ప్రస్తావించారు. ఉగ్రవాదం అన్ని దేశాల్లో ఇంక పెనవేసుకొనే ఉందని, దీనిని రూపుమాపడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.
అమెరికా పర్యటనలో ప్రధాని మోదీకి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. భారత్ మాతాకీ జై.. మోదీ జై అంటూ నినాదాలతో ఇండియన్లు హోరెత్తిస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని మోదీకి మంచి అతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భద్రతకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. దేశీయంగా జెట్ ఇంజిన్ల ఉత్పత్తిపై నిర్ణయం తీసుకున్నారు. అయితే జో బైడెన్, ఆయన సతీమణి మోదీతో ఆత్మీయంగా మెలిగారు.
అయితే అమెరికన్ కాంగ్రెస్ లో ప్రసంగం సందర్భంగా పాక్, చైనాకు మోదీ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి సందేహాలకు తావులేదని చెప్పారు. ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలపై గౌరవం, వివాదాలను పరిష్కరించుకోవడం, సార్వభౌమాధికారం, సమగ్రతను గౌరవించడం లాంటి వాటిపై గ్లోబర్ ఆర్డర్ ఆధారపడి ఉందని చైనాను ఉద్దేశించి మోదీ అన్నారు. మొదట్లో తాను తొలిసారి ఆమెరికా పర్యటన సమయంలో భారత్ 10 వ ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పారు. భారత్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పుకొచ్చారు. భారత్ అమెరికా మిత్ర బంధం కొనసాగుతుందని, కలిసి పనిచేస్తాయని చెప్పుకొచ్చారు.