
New York Times : ప్రధాని నరేంద్ర మోడీకి ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. అసలు ఒక్క దేశాధినేతకు ప్రపచంలోనే ఇంత ఆదరణా.? ఇక మోడీ సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు. దాదాపు ఏ దేశాధ్యక్షుడికి లేని ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు 8.95 కోట్లు ఇండియా నుంచే కాకుండా.. ఇతర దేశాల నుంచి కూడా ఆయన ఫాలోవర్స్ ఉన్నారంటే ఎలాంటి సందేహం అవసరం లేదు. ఏంటి అసలు దీని వెనుక ఉన్న కారణం ఏంటని చాలా రోజులుగా చాలా మంది దేశాధినేతలకు అంతుపట్టడం లేదు.
దేశాన్ని విశ్వగురువు చేస్తానని మోడీ సంకల్పం తీసుకున్నారు. దీని కోసమే ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. మొదల ప్రపంచ దేశాల మద్దతు ఉండాలి. దాని తర్వాత ఇతర దేశాల్లో భారతీయులకు సముచిత స్థానం ఉండాలి. ఇలా ఆయన మంచి వ్యూహంతో ముందుకు వెళ్తారు. మన దేశంలో మనం ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందని భావించిన ప్రధాని ఎక్కువ విదేశీ టూర్లతోనే గడుపుతుంటారు. ఇతర దేశాధినేతలను కలుస్తూ వారి ఆలోచనలు ఇండియాకు ఏ మేరకు ఉపయోగపడతాయో తెలుసుకుంటారు. ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
అసలు మోడీకి ఇంత ఆదరణ ఎలా అని, ప్రపంచ దేశాధినేతల్లో ముందు వరుసలోకి ఎలా రాగలుగుతున్నాడని అమెరికా పర్యటన వేళ అక్కడి వార్తా సంస్థ ‘ద న్యూయార్క్ టైమ్స్’ ఒక స్టోరీని పబ్లిష్ చేసింది. ఆయనకు ప్రజాధరన పెరిగేందుకు ఉపయోగపడే షో ‘మన్ కీ బాత్’. దేశాధ్యక్షుడు, ప్రధాని ఇలా ప్రముఖులు ప్రజలతో మాట్లాడాలనుకుంటే ఏదైనా ప్రత్యేక సందర్భం ఉండాలి. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ దే లాంటివి. కానీ మోడీ మన్ కీ బాత్ ను ఎంచుకున్నారు. అంటే దాదాపు చాలా ఎక్కువ సార్లు రేడియోను ఉపయోగించి ప్రజలతో నేరుగా మాట్లాడుతారు. ఆయనకు ఇదే అతి పెద్ద బలం. ఇక ఆయన పార్టీ బీజేపీది అపారమైన సోషల్ మీడియా నెట్ వర్క్ ఉంది. ఇటు మన్ కీ బాత్ ఒకటి, బీజేపీ సోషల్ మీడియా నెట్ వర్క్ రెండోది. ఈ రెండు బలాలు కలిసి ఆయన ప్రపంచంలోని గొప్ప నేతగా మారారని చెప్పింది.