
మూడు దేశాల పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ కాసేపటి క్రితం భారత్ కు చేరుకున్నారు. జపాన్, పూనువా నూగినియా, అస్ర్టేలియా దేశాల పర్యటనను ముగించుకొని ఆయన స్వదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ శ్రేణులు ఆయనకు అభినందన సభను ఏర్పాటు చేశాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిపారు. ఆస్ర్టేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించానని, ఈ అంశాన్ని ఆదేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. భారతీయ సంస్కృతిని తెలిపే ఆలయాలపై దాడులను ప్రధాని ముందే ఖండించానని తెలిపారు. మన దేశం యావత్ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్లు అందించిందని గుర్తు చేశారు. అందుకే మనదేశం వైపే ప్రపంచ దేశాల చూపు ఉందని చెప్పుకొచ్చారు. భారత్ గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ లాంటి శాంతికాముకులు పుట్టిన నేల అని తెలిపారు. సిడ్నీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ దేశ పార్లమెంట్ సభ్యులంతా తరలిరావడం గొప్పగా అనిపించిందని, అది మనదేశ గొప్పతనమని తెలిపారు. .
కార్యక్రమంలో భాగంగా జేపీ నడ్డా, సుబ్రహ్మణ్య జైశంకర్ మాట్లాడుతూ పవూవా న్యూగినియా ప్రధాని మన దేశ ప్రధాని మోదీకి పాదనమస్కారం చేయడం మన దేశానికి దక్కిన గొప్ప గౌరవమని తెలిపారు. మోదీని అంతా విశ్వ గురువుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. అస్ర్టేలియా ప్రధాని కూడా స్వయంగామోదీని ది బాస్ అని సంబోధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.