Glamorous Beauty Monal Gajjar :
సుడిగాడు సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి మోనాల్ గజ్జర్. తొలి సినిమా హిట్టయినా పేరు మాత్రం నరేష్ కే దక్కింది. దీంతో బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అని రెండో సినిమా కూడా నరేష్ తోనే చేసింది. కానీ ఆమెకు మాత్రం పేరు రాలేదు. దీంతో ఏం చేయాలో తోచలేదు. అవకాశాలు లేకపోవడంతో ఎటు పాలుపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అమ్మడుకు ఏం చేయాలో తెలియలేదు.
బిగ్ బాస్ సీజన్ 4లోకి మోనాల్ అడుగుపెట్టి తనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత అయినా అవకాశాలు వస్తాయని ఆశ పడింది. కానీ ఆమెకు అటు వెండితెర ఇటు బుల్లితెరలో ఆఫర్లు మాత్రం కనిపించలేదు. దీంతో సినిమాల్లో చాన్సుల కోసం ఎదురు చూస్తోంది. కానీ ఆమె ఆశలు మాత్రం తీరడం లేదు. అనుకున్న విదంగా తన కెరీర్ ముందుకు వెళ్లడం లేదు.
బిగ్ బాస్ లో గ్లామర్ తో ఆకట్టుకుంది. షో నుంచి బయటకు వచ్చి ఓ డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరించింది. కానీ అవకాశాలు మాత్రం పలకరించలేదు. దీంతో సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను ఎరగా వేస్తోంది. తన హాట్ ఫొటోలు పెడుతూ ప్రేక్షకులను రెచ్చగొడుతోంది. గ్లామర్ డోస్ పెంచి కుర్రకారును మతిపోగొడుతోంది. దీంతోనైనా సినిమా అవకాశాలు వస్తాయేమోనని చూస్తోంది.
మోనాల్ ఫొటోలు చూసి అందరి మతి పోతోంది. బ్యూటీ స్పాట్లు కనిపించేలా కుర్రకారులో జోష్ పెంచుతోంది. బుల్లితెర, వెండితెరలో అవకాశాలు వస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉంది. కానీ ఆమె కోరిక మాత్రం తీరడం లేదు. కానీ ఆమె ఫొటోలు నిర్మాతలు చూస్తే కచ్చితంగా ఆమెకు ఆఫర్లు ఇవ్వడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.