
Monalisa Account Hacked : మహా కుంభమేళా పుణ్యమా అని ఓవర్నైట్లో స్టార్గా మారిపోయిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మోనాలిసా భోస్లే అకౌంట్ హ్యాక్కు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ వీడియో ద్వారా తెలిపారు. హ్యాక్ చేసిన తన ఐడీని తిరిగి ఇవ్వాలని కోరారు. ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంతో కొంత సంపాదించాలనుకున్నట్లు చెప్పారు. తన గ్రామం, ఇల్లు గురించి వివరించిన మెనాలిసా… సెలబ్రిటీగా మారడంతో దండలు అమ్మడం కుదరడంలేదని చెప్పుకొచ్చారు.






