27.9 C
India
Monday, October 14, 2024
More

    Drug quality test : డ్రగ్ క్వాలిటీ టెస్ట్‌లో 50కి పైగా ట్యాబ్లెట్స్‌ ఫెయిల్‌

    Date:

    Drug quality test
    Drug quality test

    Drug quality test : ప్రస్తుతం అన్నింటిలో కల్తీ జరుగుతుంది. పాల నుంచి నూనె వరకు దేనిని కొందరు తమ లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీ చేస్తున్నారు. చివరికి ఆరోగ్యం బాగాలేకపోతే వేసుకునే మందులను సైతం కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా భారత ఔషధ నియంత్రణ సంస్థ, సెంట్రల్‌ డ్రగ్ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన డ్రగ్‌ క్వాలిటీ పరీక్షలో మనం ఉపయోగిస్తున్న దాదాపు 53 రకాల మాత్రలు క్వాలిటీ టెస్టులో ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది.

    వీటిలో పారాసిటమాల్‌ ట్యాబ్లెట్ కూడా ఉండడం అత్యంత దిగ్భ్రాంతికర విషయం ఆందోళన కలిగించే అంశం. జ్వరం వచ్చిన వెంటనే చాలా మంది వేసుకునే పారాసిట్‌మాల్‌ కూడా క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ కావడం ఆందోళనకు కలిగిస్తోంది. కాల్షియం, విటమిన్, బీపీ, డయాబెటిస్ ట్యాబ్లెట్లు సహా మొత్తం 53 మాత్రలు ఈ క్వాలిటీ టెస్ట్‌లో అర్హత సాధించలేదని సీడీఎస్‌సీఓ స్పష్టం చేసింది. ఈ జాబితాలో పారాసిటమాల్‌, కాల్షియం, విటమిన్ డీ3 సప్లిమెంట్ ట్యాబ్లెట్లు, యాంటీ డయాబెటిక్‌, హైబీపీ మాత్రలు కూడా ఉన్నాయని భారత ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది.

    సీడీఎస్‌సీఓ నెలవారీగా ర్యాండమ్‌గా కొన్ని ట్యాబ్లెట్లను సేకరించి.. వాటి నమూనాల నుంచి ఈ నాణ్యతా పరీక్షలను చేస్తుంది. తాజాగా నిర్వహించిన ఈ పరీక్షల్లోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షల్లో ఫెయిల్ అయిన ట్యాబ్లెట్స్‌లను హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీ బయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్‌తో పాటు మరికొన్ని ప్రముఖ కంపెనీలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఏఎల్ ఉత్పత్తి చేసే మెట్రోనిడాజోల్ ట్యాబ్లెట్ కూడా ఈ జాబితలో ఉండడం గమనార్హం.  గత నెలలో సీడీఎస్‌సీఓ భారతీయ మార్కెట్‌లో 156 రకాల ఫిక్స్‌డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్‌లపై నిషేధం విధించింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Wrestler : దేశ ధనవంతుల జాబితాలో హైదరాబాద్ రెజ్లర్.. ఎంత సంపాదన అంటే?

    Hyderabad Wrestler : దేశంలో ఏటికేడాది ధనవంతుల జాబితా పెరుగుతుందని కొన్ని...

    Adimulam : ఆదిమూలం.. మరో వివాదం.. ఆడియో లీక్‌.. అందులో ఏముందంటే?

    Adimulam : తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ బహిష్కృత...

    Redbus : పండుగకు ఇంటికి వెళ్లలేకపోవడమే ‘రెడ్‌బస్’ పుట్టుకకు కారణం..

    Redbus : ‘యువర్ లైఫ్ ఈజ్ బిగ్ యూనివర్సిటీ’ ఈ కొటేషన్...

    breathalyzer : బ్రీత్ ఎనలైజర్ తో పరార్.. పరువు పోగొట్టుకున్న పోలీసులు..

    breathalyzer : మందు బాబులకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు భావిస్తుంటే.. పోలీసులను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related