Mother and daughter : ఇప్పుడు బయటకు వెళ్లిన వారు ఇంటికి తిరిగి వస్తున్నారో లేదో చెప్పడం కష్టమే.. ఎందుకంటే ఏ వైపు నుండి మృత్యువు కబళిస్తుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.. తాజాగా హైదరాబాద్ సిటీలో ఒక యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల తల్లి కూతురు మరణించారు. నిన్న మంగళవారం ఈ ఘోరం జరిగింది. ఈ యాక్సిడెంట్ వివరాలు..
మంగళవారం ఉదయం హైదరాబాద్ శివారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరమైన యాక్సిడెంట్ అయ్యింది.. వాకింగ్ కోసం అని ఉదయాన్నే తల్లి కూతురు బయటకు రాగా మళ్ళీ ఇంటికి శవాలుగా మారి వెళ్లారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నగరు శివారులోని హైదర్ షా కోట్ లో నివసిస్తున్న నెమలి అనురాధ (48), ఆమె కుమార్తె మమత (26) కుమారుడు ఉన్నారు.. భర్తతో విడిగా ఉంటున్న అనురాధతో ఆమె కూతురు నివసిస్తుంది. బెంగుళూరు లో జాబ్ చేస్తున్న ఈమె కూతురు ప్రస్తుతం ఇంటి దగ్గర నుండే వర్క్ చేస్తూ తల్లితో కలిసి ఉంటుంది.. వీరిద్దరూ పక్కన ఉంటున్న వేరే ఆమెతో కలిసి మంగళవారం ఉదయం వాకింగ్ కోసం బయటకు వచ్చారు..
రహదారి పక్కన నడుస్తుండగా 120 కిలోమీటర్ల వేగంతో వచ్చిన కారు వీరిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తల్లి కూతురు అక్కడే మరణించారు. వీరితో వచ్చిన కవిత తో పాటు మరో వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ కారును ఒక లైసెన్స్ కూడా రాని ఒక యువకుడు నడుపుతున్నట్టు తెలిసింది. కారును మహ్మద్ అనే యువకుడు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. స్నేహితులతో పుట్టిన రోజు వేడుకలకు వెళ్తున్న ఇతడు కారు అదుపుతప్పి వాకింగ్ చేస్తున్న వారిని ఢీ కొట్టింది..
ReplyForward
|