17.1 C
India
Tuesday, January 21, 2025
More

    Mother Language Day : మాతృభాషా దినోత్సవం.. ఈ సందేశాలతో శుభాకాంక్షలు చెప్పేద్దామా!

    Date:

    Mother Language Day : తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడు కోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకో వడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి.

    మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినో త్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. ఈ కింది సందే శంలతో బంధుమిత్రులకు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేద్దామా!

    అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది..
    చిన్నారుల నవ్వులా అచ్చమైనది..
    అమృతం కంటే తీయనైనది..
    అందమైన మన మాతృభాష తెలుగు

    ఈ రోజు మాతృభాష దినోత్సవం..
    మన భాషను యాసను కాపాడుకోవడం మన బాధ్యత.
    భావితరాలకు కూడా ఈ ఫలాలను అందిద్దాం.
    మన భాషను బతికిద్దాం.
    అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు

    ప్రాచీన భాషల్లో మిన్న.. మన తెలుగే.
    మరి ఈ భాషను మన బావి తరాలకు అందించే బాధ్యత కూడా మనదే కదా.
    కాబట్టి, మన భాషను ప్రేమిద్దాం..
    మన భాషను ముందుతరాలకు అందిద్దాం.

    మనం ఎక్కడున్నా మన భాషను మరిచిపోకూడదు..
    బతకు తెరువు కోసం ఏ భాష మాట్లాడినా..
    అమ్మ భాషకు అన్యాయం చేయకూడదు..
    మన భాషను కాపాడుకుందాం..
    తెలుగు జాతి ఉనికి చాటుదాం.

    ఈ రోజు మాతృభాష దినోత్సవం..
    ఈ ఒక్క రోజే సంబరాల్లో మునిగి..
    మిగతా రోజుల్లో మరిచిపోవద్దు..
    బాధ్యతగా కాపాడుకుందాం..
    ‘అమ్మ’ భాష రుణం తీర్చుకుందాం.

    యాసలు వేరైనా మన మాతృభాష ఒక్కటే
    రాష్ట్రాలు వేరైనా మనమంతా తెలుగుతల్లి బిడ్డలమే.

    ఏ దేశానికెళ్లినా.. ఏ రాష్ట్రానికెళ్లినా..
    మన మాతృభాషను మరచిపోవద్దు.
    మన తెలుగు తల్లిని గుండెల్లో పెట్టుకుందాం..
    మాతృభాష గొప్పతనాన్ని చాటుదాం.
    యాసలు వేరైనా మన మాతృభాష ఒక్కటే
    రాష్ట్రాలు వేరైనా మనమంతా తెలుగుతల్లి బిడ్డలమే.

    అమ్మ రూపమే భాష..

    అమృత జలపాతం..
    నా తెలుగు భాష
    అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు..

    అమ్మ చేతిలో గోరుముద్ద తెలుగు..
    రుచిరాగాల పాల ముద్ద తెలుగు..
    అమ్మరూపమే.. భాష
    అమృత జలపాతం.. నా తెలుగు భాష

    తియ్యనైన భాష తల్లి భాష..
    అమ్మలాడు భాష అమృత భాష..
    కలువ రేకులాంటి భాష..
    అక్షరాల భాష.. కమ్మనైన పద కళ గల భాష..
    అమ్మలు మురిపించే భాష..
    బామ్మలు ముద్దాడే భాష..
    భావ గుబాళింపు.. సుగంధ భాష
    మన తెలుగు భాష.

    ప్రేమైనా.. బాధైనా..
    కోపమైనా.. భావం ఏదైనా..
    మనసారా పలకాలన్నా..
    చెవులారా వినాలన్నా..
    అది అమ్మ భాషతోనే సాధ్యం.
    స్వచ్ఛదనానికి ప్రతీకైనది..
    అమ్మ ప్రేమలా తియ్యనైనది..
    కవితా సుగంధాల భాష..
    భావ బంధమైన భాష..
    మన భాష గౌరవానికి మనవంతు కృషి చేద్దాం..
    మన మాతృభాషను కాపాడుకుందాం.

    Share post:

    More like this
    Related

    Indian Travelers : భారత ప్రయాణికులు యూకే ద్వారా వెళుతున్నారా? అయితే మీకు షాక్

    Indian travelers : అమెరికా, కెనడా సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి వచ్చే...

    Trump : 84 శాతం మంది భారతీయులు ట్రంప్ రాకను స్వాగతిస్తున్నారట

    Trump : యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (ECFR) నిర్వహించిన గ్లోబల్...

    Sankranti Celebrations : బ్రిటన్ లో అంబరాన్నంటిన తెలుగువారి సంక్రాంతి సంబరాలు

    Sankranti Celebrations : తేటతెలుగువారి ఘన పండుగ సంక్రాంతి. ఆంధ్రాలోనైనా అమెరికాలోనైనా ఈ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related