Lavu Sri Krishna Devarayalu : నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సొంతగూ టికి చేరుకుంటున్నారని సమచారం అందుతుంది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తిని నిలబెట్టాలని పార్టీ భావిస్తుందని లావు శ్రీకృష్ణదేవరాయలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ముఖ్య అనుచరులతో ఆయన సమావేశాలు నిర్వహించారు.
ఇతర పార్టీల్లోకి వెళితే ఎలా ఉంటుందన్న అంశాలను తనతో ఉన్న నాయకులను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. టిడిపిలోకి వెళ్లడం ఖాయమని రూమర్లు వచ్చాయి. అయితే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరా యలుకు సీఎంఓ నుంచి పిలుపువ చ్చినట్లు తెలుస్తోంది. ఎంపీ లావును cmo చేర్చే బాధ్యతను ముద్రబోయిన, మైలవరం కు అధిష్టానం అప్పగించింది.
నరసరావుపేట పార్లమెంటులో లావు శ్రీకృష్ణదేవ రాయలుకు మంచిపట్టు ఉంది. నేపథ్యంలో బలమైన లీడర్ బయటకు వెళ్తే పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన వైసీపీ అధిష్టానం రాజీనామా చేసిన లావు ను తిరిగి పార్టీలో కి ఆహ్వానించే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం అందుతోంది.