
MS Swaminathan Passed Away: ఆయన హరిత విప్లవ పితామహుడు. అన్నం పెట్టిన వాడిని దేవుడంటారు. మనకు నూతన వంగడాలను కనుగొని ప్రపంచ దేశాల ఆకలి తీర్చిన ఘనత ఆయన సొంతం. ఆయనే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. వ్యవసాయ విధానంలో ఎన్నో నూతన వంగడాలని కనిపెట్టి వాటితో పంటల్లో విప్లవం తీసుకొచ్చారు. దీంతో ఆయన పేరు మారుమోగిపోయింది.
ఆయన 98 ఏళ్ల వయసులో ఉదయం 11 గంటలకు చెన్నైలో తుది శ్వాస విడిచారు. అహర్నిశలు ఆహారంలో వస్తున్న మార్పులను గుర్తించి అందుకగనుణంగా పంటలు మారుస్తూ రైతులకు దిశా నిర్దేశం చేశారు. ఆహార పంటల్లో ఇండియా ఖ్యాతిని దేశదేశాలకు చాటిన ఘనత ఆయన సొంతం. వ్యవసాయంలో దేశం ముందుకు పోవడానికి తనవంతు పాత్ర పోషించడం గమనార్హం.
మేలైన గోధుమ, వరి వంగడాలను కనుగొన్నారు. వీటితో మానవుల ఆకలి తీర్చడంలో కీలక భూమిక పోషించారు. వ్యవసాయ విధానాల అమలులో కూడా ఆయన మార్గదర్శకంగా తీసుకున్నారు. అందుకే ఆయన వ్యవసాయంలో రోల్ మోడల్ గా నిలిచారు. వ్యవసాయం చేసే వారి పాలిట కల్పతరువుగా మారారు. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న జన్మించింది.
ఆయన అందించిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, రామన్ మెగసెసె అవార్డులు ఇచ్చింది. వ్యవసాయ వంగడాల వాడకంలో ఆయన చేసిన సేవలు అద్భుతాలు ఇచ్చాయి. దీని వల్ల వ్యవసాయ రంగమే ఎన్నో మలుపులు తిరిగింది. స్వామినాథన్ వ్యవసాయానికి ఎన్నో విధాలుగా సేవలందించి తన శక్తియుక్తులను ధారపోశారు. అలాంటి ఆయన మరణం అందరికి ఆవేదన కలిగించింది.