- ఈ రీ ఎంట్రీతో మేలెవరికి.. నష్టమెవరికి..

Mudraga padmanabham : ఏపీ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తున్నది. ఏపీలో ముఖ్యంగా కమ్మ, కాపు వర్గాల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. గతంలో కాపు ఉద్యమ నేతగా రాజకీయాల్లో బలమైన నాయకుడిగా, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కు పేరుంది. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నది.
పవన్ రాకతో..
జనసేన అధినేత పవన్ రాకతో కాపుల మద్దతు కొంత అటు వైపు తిరిగిందని చెప్పకనే చెబుతారు. గతంలో కాపు ఉద్యమ సారథిగా ముద్రగడ పద్మనాభం కు ఎంతో గుర్తింపు ఉంది. చంద్రబాబు హయాంలో ఆయన ఢీ అంటే ఢీ అనే స్థాయి వరకు వెళ్లారు. 2016 రైలు దహనం ఘటనలో నమోదైన కేసును ఇటీవలే రైల్వే కోర్టు కొట్టేసింది. కాపు ఉద్యమ నేతగా ఉన్నా ఆయనకు అన్ని వర్గాల్లో పట్టుంది. అయితే కాపు ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారని గతంలో ఆయన చంద్రబాబుపై పదే పదే విమర్శలు చేశారు.
ఈ సమయంలో పవన్ చంద్రబాబుతో దోస్తీ పరిణామాల నేపథ్యంలో ముద్రగడ రాజకీయ పునరాగమనం అనే అంశం చర్చనీయాంశమైంది. అయితే ముద్రగడ రీ ఎంట్రీ వెనుక ఎవరున్నారనేది కొంత చర్చ కొనసాగుతున్నది. చాలా రోజులుగా ముద్రగడ ఏపీ సీఎం జగన్ కు కొంత సానుకూలంగా ఉంటున్నారనే వాదన టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నది. మరి ఈ తరుణంలో ఆయన వైసీపీలో చేరుతారా.. లేదంటే పవన్ తో కలిసి నడుస్తారా అనేది ప్రకటించాల్సి ఉంది.
టీడీపీ కి వ్యతిరేకంగానే..
అయితే Mudraga padmanabham ఆది నుంచి టీడీపీ కి వ్యతిరేకంగా నే ఉన్నారు. ముద్రగడ రాజకీయాల్లోకి రావాలని అభిమానుల నుంచి కూడా గతం నుంచి ఒత్తిడి ఉంది. ఈ తరుణంలో ముద్రగడ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కీలకంకానుంది.