
Mudragada : వైసీపీ నేతలకు కాపు నేత ముద్రగడ పద్మనాభం గట్టి షాకిచ్చారు. తనను కలిసేందుకు నా ఇంటి దగ్గరికి వైసీపీ నేతలు ఎవరూ రావద్దని ముద్రగడ పద్మనాభం చెప్పడంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులను కలవడానికి ముద్రగడ ఇష్టపడడం లేదు. ఇంటి దగ్గరికి వెళ్లిన తోట త్రిమూర్తులను కలిసే ప్రసక్తి లేదని తెగేసి చెప్పడంతో తోట త్రిమూర్తులు వెళ్లిపోయారు. మీకు మాకు సెట్ కాదని మీ పని మీరు చూసుకోండి అంటూ ముద్రగడ పద్మనాభం వైసీపీ నేతలకు సలహా ఇచ్చారు. టిడిపి లేదా జనసేనలోకి వెళ్తానని అదీ లేకపోతే ఇంట్లో కూర్చుంటాను తప్పా వైసీపీలోకి మాత్రం వెళ్లనని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.
మొత్తం మీద కాపు నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ ఏపీ లోని ప్రధాన పార్టీలు చక్కర్లు కొడుతు న్నాయి. ఈరోజు జనసేన పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభంతో భేటీ అయి పార్టీ లోకి రావాలని ఆహ్వానిం చారు. జనసేన నేతలు కలిశా రని తెలుసుకున్న వైసీపీ నేతలు ఇవాళ ముద్రగడ పద్మనాభంతో భేటీ కావాలని పావులు కదిపారు. అయితే వైసిపి నేతల ప్రయత్నాలు విఫలమ య్యాయి. వైసిపి నేతలను కలవడం నాకు ఇష్టం లేదని ముద్రగడ పద్మనాభం మొహం మీద చెప్పేశారు. దీంతో వైసిపి నేతలు దిక్కు తోచని పరిస్థితుల్లో వెనుతిరి గాల్సిన పరిస్థితి నెలకొంది.
మొత్తం మీద కాపు నేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి వెళ్లడం దాదాపు ఖరారు అయిందని సమాచారం అందుతుంది. ఉదయం నుంచి కూడా జనసేన, టిడిపి నేతలు వరుసగా పద్మనాభంతో భేటీ అయ్యారు. రెండు పార్టీల పట్ల కూడా పద్మనాభం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. టిడిపి ,జనసేన కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో రెండు పార్టీల పట్ల కూడా సానుకూలత ఉందని తెలుస్తోంది.