
Mudragada letter : ముద్రగడ పద్మనాభం అంటే ఏపీలో తెలియని వారుండరు. కాపు ఉద్యమనేతగా ఆయన కీలకంగా పనిచేస్తున్నారు. అయితే తాను మంత్రిగా ఉన్న కాలంలో తన చాంబర్‌లోకి కాపులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టారు. అలాంటి నేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్లు.. మా జాతి అంటూ ఉద్యమానికి తెరలేపారు. వైఎస్ జగన్ కు మంచి చేసే క్రమంలో చంద్రబాబుపై కాపులో వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున గొడవలకు కారణమయ్యారు. ఆ సమయంలో ముద్రగడపై నాటి ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేసింది. అయితే గతంలో ముద్రగడ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా పది వేల ఓట్లు కూడా రాలేదు. అయితే కాపు సామాజిక వర్గంలో ఆయనకంటూ ఒక పేరు గుర్తింపు ఉంది.
అయితే ఇప్పుడు ఒక్క లేఖతో ఉన్న పరువు పోగొట్టుకున్నారు. కాపులను కించపర్చినట్లు మాట్లాడిన ద్వారంపూడికి మద్దతుగా మాట్లాడి.. పవన్ కల్యాణ్ ను విమర్శించడం ఇందుకు కారణమైంది. పవన్కు ఆయన లేఖ రాయడం.. అందులో భాష గురించి మాట్లాడటం సంచలనంగా మారింది. కాపు యువకులను..మహిళలను ద్వారంపూడితీవ్ర స్థాయిలో అసభ్య పదజాలంతో కించప్చారు. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతున్న పవన్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడంపై అంతా మండిపడుతున్నారు. గతంలో కాపు ఉద్యమానికి ద్వారంపూడి ఫండింగ్ చేశారని చెప్పడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే మరికొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముద్రగడ తో కలిసి ఉద్యమంలో ఉండి ఉప్మా తిన్నామని .. అది ద్వారంపూడి స్పాన్సర్ షిప్ అని తెలియదని ఎద్దేవా చేస్తున్నారు. అందుకే ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెబుతూ మనీయార్డర్లు పంపుతున్నారు. కాపు సంఘాలు.. నేతలు.. ముద్రగడపై తీరుపై విరుకచుకుపడుతున్నాయి. కాపు ఉద్యమం అంటూ జగన్ పంచన చేరాడని మండిపడుతున్నాయి. కాపులను చీల్చి రాజకీయ పార్టీలకు తాకట్టు పెడుతున్నారన్న ఆరోపణలు ముద్రగడపై వస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ముద్రగడ నిలబడినా.. కనీసం ఆ సామాజిక వర్గ ఓట్లు కూడా పడవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఏదేమైనా మొదటి నుంచి ముద్రగడ వ్యవహారశైలి వివాదాస్పదంగానే కనిపిస్తున్నది. ప్రస్తుతం వైసీపీ నేతలతో కలిసి ఆయన చేస్తు్న్న ప్రయాణం పవన్ పై విమర్శలకు కారణమవుతున్నదని అంతా భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ముద్రగడ నుంచి కాపు సామాజిక వర్గం దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.