Mudragada Padmanabham : వైసీపీలో చేరేందుకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ర్యాలీగా వెళ్లనట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. 14- 3 – 2024 న వైఎస్ఆర్ సీపీలో చేరుటకు ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ప్రయాణమవుతాననీ ఆయన తెలిపారు.
మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో పాలుపంచు కోవడానికి రావాలని ఆయన వారి కార్యకర్తలను అభిమానులకు పిలుపునిచ్చారు. కాగా ప్రయాణం లో కావాల్సిన ఆహారం ఎవరికి వారు వాహనంలో తెచ్చుకోవాలని సూచించారు.
మొత్తం మీద కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అయిపోయింది. భారీ ర్యాలీతో ఆయన కిర్లంపూడి నుంచి 14 వ తారీకు ఉదయాన తాడేపల్లికి ర్యాలీగా వెళ్లనున్నారు.
మొదట జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చెప్పిన ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత జరిగిన రాజకీ య పరిణామాలు తన అభిప్రాయాన్ని మార్చుకు న్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీలో చేరేందుకు ఆయన సుఖతను వ్యక్తం చేశారు.