
Mukesh Ambani Family : ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. వారు బోటు విహారంలో పాల్గొని, అనంతరం త్రివేణి సంగమానికి చేరుకొని పూజలు నిర్వహించారు.
ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు కుంభమేళాకు హాజరై పుణ్యస్నానం ఆచరించారు. ఇక మాఘ పౌర్ణమి సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశముంది. కుంభమేళా త్వరలో ముగియనుండటంతో ప్రయాగ్రాజ్‌కు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు.