Jaya Prada : కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ పేరును మాత్రం నిత్యం సోషల్ మీడియాలో వినిపించేలా చేస్తున్నారు. ఎవరో ఒకరు కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుతూనే ఉన్నారు.. మరి తాజాగా సీనియర్ హీరోయిన్ జయప్రద కూడా ఈ కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది.. ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జయప్రద అంటే తెలియని తెలుగు వారు లేరు.. ఈమె తెలుగు ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. తెలుగులో పాత్రమే కాకుండా అన్ని భాషల్లో నటించి మెప్పించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ అందుకున్న ఈ భామ అప్పట్లోనే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకునేది..
ఇక ప్రజెంట్ ఈమె సినిమాలకు దూరంగా రాజకీయాలకు దగ్గరగా ఉంటుంది అయితే తాజాగా ఈ భామ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించి చేసిన వ్యాఖ్యలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. ఈమె ఈ విషయంపై మాట్లాడుతూ.. మా తరంలో పెద్దగా ఇలాంటివి లేవు.. నేను ఎప్పుడు ఇలాంటివి ఎదుర్కోలేదు.. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఛాన్సులు వచ్చేవి..
కానీ ఇప్పుడు అలా కాదు.. ముంబై నుండి వస్తున్న చాలా మంది హీరోయిన్లు చాన్సుల కోసం కమిట్ మెంట్స్ ఇచ్చేస్తున్నారు.. వారే డైరెక్టర్లు, నిర్మాతల దగ్గరికి వెళ్లి అలా కమిట్మెంట్స్ ఇస్తుంటే దీని వల్ల కాస్టింగ్ కౌచ్ అనేది అందరికి స్ప్రెడ్ అయ్యింది. ఇది తగ్గాలంటే అమ్మాయిల్లోనే ముందుగా మార్పు రావాలి.. ఇది ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కేసు.. అవకాశాల కోసం లొంగిపోకుండా టాలెంట్ ను నమ్ముకుని ఉంటే ఎప్పుడో మనకు కూడా అవకాశాలు వస్తాయి అంటూ ఈమె చెప్పుకొచ్చింది.