Tejaswi Madiwada ప్రస్తుతం టాలీవుడ్ నుండి పిచ్చ ఫాలోయింగ్ తో క్రేజ్ తో రాణిస్తున్న భామల్లో తేజస్వి మదివాడ ఒకరు. తెలుగు భామ అయినప్పటికీ ఇక్కడ పెద్దగా అవకాశాలు అందుకోలేక పోతుంది.. అందం, అభినయం అన్ని ఉన్నప్పటికీ లక్ మాత్రం కలిసి రావడం లేదు. అయితే తాజాగా ఈమె కాస్టింగ్ కౌచ్ మీద స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఒప్పుకున్న వారికే అవకాశాలు వస్తున్నాయి అని చాలా మంది ఆరోపిస్తున్నారు.. తాజాగా తేజశ్వి మడివాడ కూడా కాస్టింగ్ కౌచ్ మీద స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది.
ఈమె మాట్లాడుతూ.. మన టాలీవుడ్ లో తెలుగు వారికీ పెద్దగా అవకాశాలు రావు.. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా కమిట్ మెంట్ కు ఒప్పుకోవాల్సిందే.. అలా ఒప్పుకుంటేనే ఛాన్సులు వస్తాయి.. మరి అలాంటి వాటికీ తెలుగు అమ్మాయిలు రెడీగా ఉండరు.. అందుకే మన వారికీ ఛాన్సులు రావు..
కానీ ముంబై నుండి వచ్చే అమ్మాయిలు అన్నిటికి రెడీ అయ్యే సినీ ఇండస్ట్రీ లోకి వస్తారు. వారు కమిట్ మెంట్ కు కూడా ఓకే చెబుతారు.. అందుకే వారికీ అవకాశాలు వస్తాయి.. తెలుగు అమ్మాయిలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేరు కాబట్టే ఇలా మిగిలి పోతున్నారు అని నన్ను కూడా చాలా మంది కమిట్మెంట్స్ అడుగగా నేను నో చెప్పను. అందుకే స్టార్ హీరోయిన్ కాలేక పోయాను అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.