
Saif Ali Khan : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు ముంబైలోని ఇంట్లో తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ దాడిలో సైఫ్ అలీఖాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయనకు లీలావతి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. సైఫ్ అలీఖాన్ పై మర్డర్ అటెంస్ట్ జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
సైఫ్ అలీఖాన్ పై దుండగుడు దాడి వార్తతో తీవ్ర కలత చెందాను. యన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి పై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.






