
Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన నటుడు అమర్ దీప్, తాజాగా కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లో తన ఫస్ట్ లవ్ స్టోరీను షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఓ టాస్క్‌లో తన మొదటి ప్రేమ గురించి చెప్పాల్సిన సందర్భంలో, తన కళ్ల ముందే తన ప్రేయసిని మరొకరు హత్తుకున్న ఘటనను గుర్తుచేసుకొని వేదన వ్యక్తం చేశాడు. అమర్ దీప్ చెప్పిన ప్రకారం, తనను స్వయంగా బస్‌లో ఎక్కించిన అమ్మాయి, వేరొకరిని ప్రేమించిన విషయం తనకు తెలియక చాలా బాధపడ్డాడట. ఈ సంఘటన తనను లోలోపల తాకిందని, అప్పటి బాధను మర్చిపోలేనని చెప్పాడు.
ప్రస్తుతం అమర్ దీప్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు, ఇందులో సురేఖావాణి కూతురు సుప్రీత హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, అమర్ దీప్ సీరియల్ నటి తేజస్విని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.