Aishwarya Lakshmi : దుల్కర్ సల్మాన్ చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’ అభిమానులకు, సినీ ప్రియులకు తీవ్ర నిరాశ కలిగించింది. నెగిటివ్ రివ్యూలే కాకుండా సినిమా పేలవమైన డైలాగులు, ఎగ్జిక్యూషన్, ఇతర కారణాల వల్ల నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది నటి ఐశ్వర్య లక్ష్మి. ఆమె మాట్లాడుతూ ‘వాస్తవానికి, కింగ్ ఆఫ్ కొత్త భారీ ట్రోల్ తర్వాత సినిమా ప్రాజెక్ట్‌లు వస్తాయా? అని భయపడ్డాను. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో పూంగుజలి చేసినా పెద్దగా ప్రముఖ్యత దక్కలేదు. దీని తర్వాత వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త కూడా నిరాశ పరిచింది’ అన్నారు. ఇది కెరీర్‌ను ప్రభావితం చేసిందని చెప్పుకచ్చింది. కొంత మంది దర్శకులతో పని చేయడంపై ఆనందం ఉంటుందని చెప్పిన ఆమె.. తనకు సరిపోయే పాత్రలు ఉంటే తప్పకుండా సంప్రదించాలని కోరినట్లు చెప్పింది.
ఐశ్వర్య లక్ష్మీ ఇటీవల చేసిన ‘హలో మమ్మీ’ ప్రమోషన్ వర్క్ జరుగుతోంది. దీని కోసం ఆమె ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాహంపై తన ఒపీనియన్ మార్చుకున్నానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు 25 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాను. అందుకు మ్యాట్రిమోనిలో కూడా పెట్టాను. కానీ ఆ తర్వాత మనసు మార్చుకున్నాను. ఇప్పటి జనరేషన్ లో వివాహం అనేది బంధికానాగా ఉంది. పెళ్లి చేసుకున్న వారంతా రాజీపడే బతుకుతున్నారు. అందుకే వ్యక్తిగతంగా ఎదగడం లేదు. వారందరినీ చూసిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను.’ అని చెప్పుకచ్చారు.