Star Hero Jayam Ravi : జయం రవి అనే తమిళ హీరో తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విడాకుల విషయం భర్త తనకు చెప్పకుండానే ఒక్కడే డిసిషన్ తీసుకున్నాడని జయం రవి భార్య అర్తి గతంలోనే ఆరోపించింది. ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేని చెప్పింది. వీరికి 2009 సంవత్సరంలో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 15 సంవత్సరాలు కలిసి ఉన్న జయం రవి దంపతులు సడెన్ గా విడాకుల వార్తలతో వైరల్ అయ్యారు.
జయం రవి దంపతులకు ఆరోహ్, అయన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2003 లో సంవత్సరంలో జయం సినిమాలో హీరోగా నటించగా ఆయన సినిమా పేరుతోనే ఫేమస్ అయ్యారు. జయం రవి ఎక్కువగా తన సినిమాలు తెలుగు నుంచి డబ్బింగ్ చేసుకునే వాడు. తెలుగులో హిట్ అయిన సినిమాలను తమిళంలో తీసి హిట్స్ కొట్టేవారు. ఇలా తమిళ ఇండస్ట్రీలో జయం రవి ఫేమస్ అయ్యారు.
తాజాగా వీరి విడాకుల అంశంలో మరిన్ని లొసగులు బయటపడ్డాయి. తన భార్య తనను ఇంటికి రానీయడం లేదని ఆ ఇంట్లో ఉన్న వస్తువులు అప్పగించాలని జయం రవి వేడుకున్నారు. తన భార్య అర్తి తనను గెంటేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరి వివాదం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది.
జయం రవి విడాకుల అంశం తెరపైకి రాగానే సెలబ్రెటీలకు ఏమైంది ఇలా ఎందుకు విడాకులు తీసుకుంటున్నారనే చర్చ జోరుగా నడుస్తోంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండగా వీరు మనస్పర్థల కారణంగా వేరు పడ్డారు. కానీ వీరి పిల్లల గురించి ఆలోచించడం మానేశారని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. జయం రవి వ్యక్తిగత జీవితంలో ఇక బాధలు భరించలేనని చెప్పి విడాకులు ఇచ్చినట్లు ఆయన సన్నిహితులు వాపోయినట్లు సమాచారం. మొత్తం మీద సెలబ్రెటీల జీవితాల్లో రోజుకో విడాకుల వార్త వినాల్సి వస్తుందేమోనని అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. జయం రవిని కోర్టు ఆదేశాలతో నైనా తన ఇంట్లోకి భార్య అర్తి రానిస్తుందో లేదో చూడాలి.