28.6 C
India
Wednesday, September 16, 2026
More

    నాదీ భారతీయ డీఎన్ఏనే.. ఇండోనేషియా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

    Date:

    Indonesian Prime Minister
    Indonesian Prime Minister

    Indonesian Prime Minister : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు భారత్‌తో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయన్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తన మూలాలు భారత్‌లో ఉన్నట్లు వెల్లడయిందన్నారు.

    గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో, ఉప రాష్ట్రపతి జగదీశ్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంలో ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో తన ప్రసంగంతో నవ్వులు పూయించారు.

    కొన్ని రోజుల క్రితం తాను జన్యు విశ్లేషణ (డీఎన్ఏ) పరీక్షలు చేయించుకోగా, అందులో తనది భారతీయ డీఎన్ఏగా తేలిందని సుబియాంతో పేర్కొన్నారు. భారతీయ సంగీతం వింటే తాను హుషారుగా నృత్యం చేస్తానని చాలా మందికి తెలుసునన్నారు. ఇది తన భారతీయ మూలాల్లో భాగమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. సుబియాంతో మాటలతో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ సహా సభికులు పెద్దగా నవ్వేశారు.

    భారత్, ఇండోనేషియాకు పురాతన పరంగా సుదీర్ఘ చరిత్ర ఉందన్న ఆయన రెండు దేశాలకు నాగరిక సంబంధాలు ఉన్నాయన్నారు. రెండు దేశాల భాషలు సంస్కృతం నుంచే వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు. తమ దేశంలో ఎంతో మంది పేర్లు సంస్కృతంలోనివేనని చెప్పారు. రోజువారీ జీవితాల్లో పురాతన భారతీయ నాగరికత ప్రభావం బలంగా కనబడుతోందన్నారు. మన జన్యువుల్లో ఇదొక భాగం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : ప్రధాని మోదీతో సతీసమేతంగా మంత్రి నారా లోకేష్ భేటీ

    Nara Lokesh Meet PM Modi : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

    Swami Sivananda : ప్రసిద్ధ యోగా గురువు స్వామి శివానంద కన్నుమూతపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగం

    Swami Sivananda : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి...

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    PM Modi : ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు

    PM Modi : మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని...