Sobhita Dhulipala : శోభిత ధూళిపాలను మూవీస్, వెబ్ సిరీస్‌లో చూస్తూనే ఉన్నాం. 2016లో రామన్ రాఘవ్ 2.O ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మోడల్ గా శోభిత నిరూపించుకుంది. మిస్ ఎర్త్ 2013కు భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’లో కీ రోల్ చేసింది.
ఇక, తెలుగులో గుఢచారి, మేజర్, మలయాళంలో మూతోన్, కురుప్, తమిళంలో పొన్నియిన్ సెల్వన్ 1, 2లలో చేసింది. హిందీ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’లో కూడా నటించింది. తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది శోభిత. ఆమె తండ్రి మర్చంట్ నేవీ ఇంజినీర్ కాగా తల్లి స్కూల్ టీచర్. ఆమె చదువు వైజాగ్ లోనే సాగింది. ఆమెకు 16 సంవత్సరాల వయస్సులో ముంబైకి వెళ్లింది. అక్కడ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనమిక్స్ లో చేసింది. ఆమెకు భరతనాట్యం, కూచిపూడి అంటే మక్కువ దీంతో అందులో ప్రావీణ్యం సంపాదించింది.
ఇప్పటి వరకు శోభిత ధూళిపాల 13 (ఇంకా ఒకటి రిలీజ్ కావాల్సి ఉంది) చిత్రాల్లో నటించారు. ఇక వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుంటే మూడింటిలో చేసింది. చాలా అవార్డులకు నామినేట్ చేసిన ఏవీ ఆమెను వరించలేదు. చివరగా.. ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు లో ‘ది నైట్ మేనేజర్’కు సంబంధించి ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది.
హాట్ అండ్ సెక్సీ గర్ల్ గా యంగ్ జనరేషన్ తో ముద్ర వేయించుకుంది ధూళిపాళ్ల. ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ. శోభిత ఓ రెడ్ బాడీ కాన్ డ్రెస్‌తో కనిపించింది. పార్టీ ఔట్‌ఫిట్ ధరించి ఫొటో షూట్‌లో పాల్గొంది. రెడ్ డ్రెస్‌లో ఆమెను చూసిన కుర్రకారుకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ‘డీమ్ బై గాబ్రియేల్లా’ కోసం ఈ ఫొటో షూట్ చేసిందని తెలుస్తోంది. శోభిత ధరించిన రెడ్ బాడీకాన్ పార్టీ ఔట్ ఫిట్ ధర అక్షరాల రూ.19,500 వరకు ఉంటుందట.