ఇక వీరి జీవితాల్లో జరిగిన కొన్ని ఘట్టాలను బేస్ చేసుకొని దర్శక, నిర్మాతలు చిత్రాలను వెండితెరకు ఎక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చింది ‘మళ్లీ పెళ్లి’ సినిమా. ఇందులో హీరో హీరోయిన్స్ గా చేసిన నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నరేశ్, వీకే నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం ఎంఎస్ రాజు వహించాడు. నరేశ్, పవిత్రతో పాటు జయసుధ, శరత్‌బాబు, వనిత విజయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడకున్నా ఒకే అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.
ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి కాన్సెప్ట్ తో వస్తున్నాడు నాగ చైతన్య. అయితే లవ్, మ్యారేజ్, డైవర్స్ ఈ మూడింటి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలై దూసుకుపోతున్న ‘సామజవరగమన’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చైతూ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కథ ఎక్కువగా విడాకుల చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఎంటర్ టైన్ చేసేందుకు ఇందులో కూడా కామెడీ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తన లైఫ్ స్టోరీని కూడా నాగ చైతన్య ఈ సినిమాతో వెండితెరపై చూపిస్తాడన్న టాక్ మాత్రం ఇప్పుడు చిత్ర సీమలో నడుస్తోంది.
ReplyForward
|