Nagababu vs Allu arjun : మెగా బ్రదర్ , జనసేన నాయకుడు నాగబాబు ఇటీవల చేసిన ట్వీట్ పుష్ప 2 గురించే అని సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. “వారు వీలైనంత త్వరగా తప్పు మార్గాన్ని ఎంచుకున్నారు. వీలైనంత త్వరగా దాన్ని సరిదిద్దుకో.. లేకపోతే, ఈ మార్గం మీకు మరింత కష్టతరం కావచ్చు. “తప్పును సరిదిద్దండి” అన్న స్వామి వివేకానంద కోట్ ను పోస్ట్ చేశారు.
పుష్ప రిలీజ్ వేళ చేసిన ఈ పోస్ట్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి పెట్టినట్లు నెటిజన్లు చెబుతున్నారు. అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య వివాదం కొనసాగుతోందని గత కొన్నాళ్లుగా పదే పదే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ ఇటీవలి ఎన్నికల్లో జనసేనకు బదులు వైసీపీ అభ్యర్థికి మద్దతిచ్చాడు కాబట్టి.. అప్పటి నుంచి వివాదం కొనసాగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమెంత అనేది తెలియకపోయినా నాగబాబు మాత్రం నిత్యం ఎన్నో పోస్టులు పబ్లిష్ చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నాడు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని అంతా క్లియర్‌గా తేలింది.
గత కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 గురించి నాగబాబు ట్వీట్ చేసినట్లు సమాచారం.