Nagabaranam on Vinayaka Chavithi : గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగిత్యాలలో ఓ విత పరిణామమం చోటు చేసుకుంది. సోమవారం వినాయకుడు పూజలు అందుకుంటున్న సమయంలోనే ఓ నాగుపాము గణపతి మెడలోకి చేరింది. జగిత్యాల వాణినగర్ లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో 48 అడుగుల భారీ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
సోమవారం ఉదయం భక్తులు పూజలు చేస్తుండగా నాగుపాము వచ్చి పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి చేరింది. శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగుపాము ఆయన కుమారుడైన గణపతి మెడలోకి వచ్చి చేరిందని భక్తులు విశేషంగా చెప్పుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.