Nagarjuna : రెండు రోజుల క్రితం నాగ చైతన్యకు-శోభిత దూలిపాళ కు ఎంగేజ్‌మెంట్ జరిగింది. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల మధ్య ఈ తంతు ముగిసింది. ఈ విషయాన్ని చై తండ్రి నాగార్జున తన ఎక్స్ ఖాతా ద్వారా వివరించారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో గాసిప్ లు మొదలయ్యాయి. చై-సామ్ విషయంలో ఏం జరిగిందంటే? నుంచి సామ్ దే.. చై దే.. తప్పు అనే వరకు
బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సమంతను నిందించాలని కొందరు నిందిస్తుంటే.. నాగ చైతన్యను మరి కొందరు నిందిస్తున్నారు. ఇది వారికి కొత్తేమి కాదు. ఇది వీరు విడాకులు తీసుకున్నప్పటి నుంచి కొనసాగుతున్న వ్యవహారమే.
తాజాగా నిశ్చితార్థం వార్తలతో చర్చ మరింత ముదిరింది. చై, సామ్ ఎందుకు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారనే దానిపై ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ లేదు. సన్నిహిత కుటుంబ సభ్యులకు తప్ప అసలు కారణాలు ఎవరికీ తెలియదు. కొన్ని ఊహాజనిత, కల్పిత కథలు మాత్రమే చలామనిలో ఉన్నాయి.
అయితే విడాకుల తర్వాత నాగ చైతన్య గురించి ఇటీవల నాగార్జున మాత్రం వివరించారు. విడాకుల తర్వాత నాగచైతన్య డిప్రెషన్ తో బాధపడుతున్నాడని నాగార్జున తొలిసారిగా బయటపెట్టాడు. ఈ విషయాన్ని చాయ్ బహిరంగంగా వ్యక్తం చేయనప్పటికీ, నాగ్ ఒక టాబ్లాయిడ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు, తాను సంతోషంగా లేనని వారికి తెలుసునని పేర్కొన్నాడు.
చై డిప్రెషన్ ను చై తండ్రి నాగ్ వెల్లడించడంతో కుటుంబం నుంచి ఇది బహుశా మొదటి అధికారిక ప్రకటననే అనుకోవాలి. నాగ చైతన్య-శోభిత గతాన్ని పక్కన పెట్టి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని, ఈ జంటకు కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని ఆశిద్దాం.