నటీనటులు :
నాగ సౌర్య
యుక్తి తరేజా
చాకో
సత్య
బ్రహ్మాజీ
అనంత్ శ్రీరామ్
సప్తగిరి
శరత్ కుమార్
డైరెక్టర్ : పవన్ బాసంశెట్టి
ప్రొడ్యూసర్ : చెరుకూరి సుధాకర్
మ్యూజిక్ : పవన్ సిహెచ్
నాగ సౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ”రంగబలి”.. ఈ సినిమాకు డైరెక్టర్ పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించాడు.. ఈ సినిమా ఈ రోజు అంటే జులై 7న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.. ఈ సినిమాకు ముందు నుండి భారీ ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర చేసారు.. ఈ సినిమాతో అయినా ఛలో వంటి హిట్ కొట్టాలని నాగసౌర్య కోరుకుంటున్నాడు.
కథ :
రాజవరం లోని రంగబలి సెంటర్ కు చెందిన శ్రీ సౌర్య (నాగ సౌర్య) ఎలాంటి ఫ్యామిలీ బాధ్యతలు లేకుండా స్నేహితులతో కలిసి గాలి తిరుగుళ్ళు తిరుగుతుంటారు.. అయితే తండ్రి మాత్రం కొడుకు ప్రయోజకుడు అయ్యి తాను నడిపే మెడికల్ షాప్ ను చూసుకోవాలని ఆరాట పడుతుంటాడు.. అక్కడే ఉంటే ఇంకా చెడిపోతాడు అని కొడుకుని వైజాగ్ పంపిస్తాడు..
అక్కడే శ్రీ సౌర్య మెడికల్ స్టూడెంట్ ( యుక్తి తరేజా) సహజ ప్రేమలో పడగా తన కూతురును పెళ్లి చేసుకోవాలి అంటే వైజాగ్ వచ్చి స్థిరపడాలని ఆమె తండ్రి కండిషన్ పెడతాడు. ఆ తర్వాత శ్రీ సౌర్య ఏం చేసాడు? సహజను విదిలేసాడా? ఆమె కోసం వైజాగ్ వచేసాడు? లేదంటే తండ్రి కోరుకున్నట్టు మారిపోయాడా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ :
ఈ సినిమా ఫుల్ ఎంటెర్టైన్మెంట్ తో జోష్ గా సరదాగా సాగిపోయింది. ఇంటర్వెల్ వరకు ఎలాంటి ట్విస్టులు లేకుండా కామెడీతో కథ సాగింది. ఇక కమెడియన్ సత్య కామెడీ బాగా క్లిక్ అయ్యింది. ఫస్టాఫ్ అప్పుడే అయిపోయిందా అనే ఫీల్ ప్రేక్షకులకు కలుగుతుంది.. ఇక సెకండాఫ్ పర్వాలేదనిపించింది.. ప్రీ క్లైమాక్స్ లో కొద్దిగా కథ తేలిపోయి ఎమోషన్స్ ను పండించలేక పోయింది.. ఎమోషన్స్ లేకపోయినా కామెడీ ఆశించే వారికీ మాత్రం మంచి ఫీలింగ్ వస్తుంది..
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
డైరెక్టర్ కు మొదటి సినిమా అయిన ఆయన ఎంచుకున్న కథ, పండించిన కామెడీ అలరించింది అనే చెప్పాలి.. ప్రీ క్లైమాక్స్ బాగుండి ఉంటే ఇంకా అదిరిపోయేది.. నటీనటులు కూడా వారి పాత్రలకు న్యాయం చేసారు. నాగ సౌర్య ఎనర్జీ, జోష్ ఆకట్టుకుంటుంది.. ఇక యుక్తి కూడా అందాల ఆరబోత మాత్రమే కాదు తన పాత్రకు కూడా న్యాయం చేసింది.
చివరిగా..
కామెడీ ఆశించే వారు ఈ సినిమాకు నిర్మొహమాటంగా చూడవచ్చు.. లవ్, కామెడీ, సొంత ఊరు అనే ఎమోషన్స్ ను ఈ సినిమాలో చూడవచ్చు..
రేటింగ్ : 2/5
ReplyForward
|