
హైదరాబాద్ కళాసిగూడలో ఇలాగే శనివారం ఓ విషాదం సంఘటన చోటు చేసుకుంది. పాలకోసం బయటకు వెళ్లిన చిన్నారి మౌనికను మ్యాన్‌హోల్ మింగేసింది. నగరంలో ఇవాళ వర్షం పడగా..రోడ్లన్ని జలమయమయ్యాయి. వర్షపు నీరు భారీగా మురుగు కాల్వల్లోకి వచ్చి చేరింది. పెద్ద ఎత్తున వాన నీరు డ్రైనేజిలోకి రావడంతో.. నాలాలు పొంగిపోర్లాయి.
ఈనేపథ్యంలోనే కళాసిగూడలో పలుచోట్ల కాల్వలు తెరచుకోవడంతో..ఏమారపాటుగా వెళ్లిన నాలుగో తరగతి చదువుతున్న మౌనిక అందులో పడి మృతి చెందింది.అయితే మౌనిక నాలాలో పడిన విషయాన్ని గమనించిన స్థానికులు,అధికారులు ఆమెను వెతికేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే నాలాలో కొట్టుకుపోయిన చిన్నారి పార్క్ లైన్ వద్ద శవమై తేలింది.
దీంతో కళాసిగూడలో విషాదఛాయాలు ఆలుముకున్నాయి. మ్యాన్ హోల్స్‌ను సరిగ్గా బిగించకపోవడంపై స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులపై మండిపడ్డారు. కేవలం రెండు గంటల పాటు కురిసిన వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే సిటీలో భారీగా వర్షాలు పడితే సిచ్యుయేషన్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు.






