
Nandamuri Balakrishna : తెలంగాణ ప్రభుత్వ దృష్టి సినీ హీరో బాలకృష్ణ, జానా రెడ్డి ఇళ్లపైకి మళ్లినట్టు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్‌లోని నందమూరి బాలకృష్ణ ఇంటిని 6 అడుగుల మేర మార్క్ చేశారని, ఆయన ఇంటికి బుల్‌డోజర్లు కూడా వచ్చాయని మీడియాలో వార్తలు హల్‌చల్ సృష్టించాయి.
కేబీఆర్ పార్కు చుట్టూ ఓవర్‌పాస్‌లు, అండర్‌గ్రౌండ్ ప్యాసేజ్‌లు నిర్మించాలని కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం యోచించిన సంగతి తెలిసిందే. ఈ ప్రణాళికల్లో భాగంగా, జానా రెడ్డి మరియు బాలకృష్ణ వారి ఇంటిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిని సంప్రదించకుండా, వారి ఇంటి గోడలపై గుర్తులను పూసారు.
దీంతో బాలకృష్ణ, జానా రెడ్డి ఇద్దరూ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. మొత్తం చూసిన అభిమానులు తెలంగాణలో అసలు ఏం జరుగుతుందోనని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. సినీ తారలపై సీఎం రేవంత్‌రెడ్డికి అంత కోపం ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు.