
ఏపీ సీఎం జగన్ కు మెగా బైట్ అంటే ఏంటి ? గిగా బైట్ అంటే ఏంటో అర్ధం తెలుసా ? అంటూ ఏపీ సీఎం జగన్ ఇజ్జత్ తీసిపడేసాడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర హిందూపురం నియోజకవర్గంలోకి అడుగు పెడుతుండటంతో అల్లుడికి ఘనస్వాగతం పలకడానికి అలాగే ఆ పాదయాత్రలో పాల్గొనడానికి భారీ కాన్వాయ్ తో గార్లదిన్నె చేరుకున్నాడు బాలయ్య.
ఆ సందర్బంగా బాలయ్య మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు. మెగా బైట్ కు గిగా బైట్ కు తేడా తెలియని వ్యక్తి ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. 8 లక్షల కోట్ల అప్పులు చేసాడు ? ఆ సొమ్ముతో రోడ్లు వేసారా ? అభివృద్ధి పనులు చేసారా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. మంచి పాలన కోసం ప్రజలు ప్రశ్నించాలని , మీ కోసం , భవిష్యత్ తరాల కోసం ఓటును సరైన మార్గంలో ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించాడు.






