20.8 C
India
Friday, February 7, 2025
More

    Nara Lokesh : డిప్యూటీ CM గా నారా లోకేష్.. కూటమి సర్కార్ లో వివాదం పొంచి ఉందా?

    Date:

    Nara Lokesh
    Nara Lokesh

    Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో త్వరలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది, ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎం హోదాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు.

    అయితే సీఎం చంద్రబాబు పై పార్టీ ముఖ్యులతోపాటు నందమూరి కుటుంబం నుంచి కొత్తగా డిమాండ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ కు సమాన హోదాపై ఒత్తిడి పెరుగు తుంది, దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారని విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది.

    రానున్న నాలుగున్నర ఏళ్లు లోకేష్ నాయకత్వాన్ని పటిష్ట పర్చటానికి కీలక సమయమని, ఆ దిశగా అడుగులు వేయాలని టీడీపీ వర్గాలు భావిస్తు న్నట్లు తెలుస్తోంది.అందుకే, వీలైనంత తొందరగా లోకేశ్‌ను డిప్యూటీ సిఎం చేయాలని, ఆ తరువాత సీఎం సీటును అప్పగించేం దుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ఇప్పటికే మంత్రాంగంమొదలయింది అయితే, డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని షరతు విధించిన పవన్ కల్యాణ్ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠగా మారింది. కూటమి ప్రభుత్వ తీరుతెన్నులను, టీడీపీ ప్రణాళికలను నిశితంగా గమనిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందికు సమ్మతించక పోవచ్చన్నది జనసేన వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి

    ఈ పరిస్థితుల్లో పవన్ అనే హర్డిల్ ను అధిగమించి లోకేష్ కు పట్టం కట్టేందుకు చంద్రబాబు ఇప్పటికే ఎత్తు గడలు వేయడం మొదలు పెట్టారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పట్నంలో పర్యటిం చిన ప్పుడు, ప్రధానితో పాటు వేదిక మీద లోకేశ్‌కు స్థానం కల్పించడం ఈ ఎత్తుగడల్లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ అసర్టివ్‌గా ఉండడం, కాకినాడ పోర్టు, తిరుపతి తొక్కిసలాట వంటి ఘటనల్లో కఠినమైన వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు టీడీపీ శ్రేణులను ఆలోచనల్లో పడేసినట్లు తెలుస్తోంది.

    కూటమి ప్రభుత్వంలో పవన్ స్పెషల్ ఫోర్సుగా కనిపించడం టీడీపీని ఇరకాటంలో పడేస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా లోకేశ్‌ను ముందుకు తీసు కురావాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తోంది. టీడీపీ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి అని కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Vangalapudi Anita : వంగలపూడి అనితకు 20వ ర్యాంక్.. హోంమంత్రి మార్పు తప్పదా?

    Vangalapudi Anita : తిరుపతి లడ్డూ, హోం మంత్రిత్వ శాఖ, రేషన్ బియ్యం...

    Chandrababu Naidu : ఏపీలో ఏ మంత్రి బెస్ట్.. ర్యాంకులు వెల్లడించిన చంద్రబాబు

    Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల పనితీరును నిర్ధారించే విషయంపై చంద్రబాబునాయుడు తాజాగా...

    Private car owners : ప్రైవేటు కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్!

    private car owners : జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే ప్రైవేటు కారు...

    Supreme Court : మొదటి భర్తతో విడాకులు తీసుకోకున్నా.. రెండో భర్త నుంచి భరణానికి భార్య అర్హురాలే : సుప్రీంకోర్టు

    Supreme Court ఫ తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషనర్....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu Naidu : ఏపీలో ఏ మంత్రి బెస్ట్.. ర్యాంకులు వెల్లడించిన చంద్రబాబు

    Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల పనితీరును నిర్ధారించే విషయంపై చంద్రబాబునాయుడు తాజాగా...

    Pawan Kalyan mania : దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ మేనియా : ఢిల్లీలో బీజేపీకి వర్తిస్తుందా?

    Pawan Kalyan mania : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

    Nara Lokesh : డిప్యూటీ సీఎం పదవి పై స్పందించిన నారా లోకేష్.

    Nara Lokesh : రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవి పై చర్చలు...