Nara Lokesh వైఎస్ జగన్, నారా లోకేశ్ ఇద్దరూ మాజీ సీఎంల పిల్లలే అయినా.. చాలా విషయాలలో వారికి ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే భావనను పెంచుకున్నాడు వైఎస్ జగన్. కానీ నారా లోకేశ్ అలా కాదు చాలా సంవత్సరాలు విలాసాలలో గడిపాడు. ఇద్దరి రాజకీయ ప్రస్థానం వేరు.. వాక్ చాతుర్యం వేరు.. దీనికి తోడు వ్యవహర శైలి కూడా భిన్నంగా ఉంటాయి.
వైఎస్ జగన్ సభలు సమావేశాల్లో ఆచి తూచి మాట్లాడతారు. చాలా వరకు తెలుగు భాషను స్పష్టంగా ఉచ్చరిస్తారు. కానీ నారా లోకేశ్ మాత్రం అలాకాడు. తెలుగును కూనీ చేస్తుంటాడు. లోకేశ్ యువగళం పాదయత్రలో భాగంగా వివిధ సందర్భాలలో మాట్లాడిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తెలుగులోని సాధారణ స్వరాలను కూడా పలకలేకపోతున్నారు లోకేశ్. ఇక ఇది చాలదు అన్నట్లు ఉత్తర కుమారుడిగా ప్రగల్బాలు పలుకుతున్నాడు.
తన తల్లి తనను క్రమశిక్షణతో పెంచిందన్న లోకేశ్.. అమ్మాయిలతో దిగిన ఈ ఫొటోలు ఏంటి అంటూ ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను ‘పొలిటికల్ పంచ్’ ట్విటర్ ఖాతాలో ఉంది. వీడియోను చూసిన నెటిజన్లు లోకేశ్ మాటలకు ఆయన లైఫ్ స్టయిల్ కు అస్సలు పొంతన లేదని కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ నాయకుడు లోకేశ్ ను విమర్శించే తీరు మరింత హస్యాస్పదంగా ఉంది. దీన్ని చూసిన నెటిజన్లు కామెడీతో లోకేశ్ కిత కితలు పెడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.
కామెడీతో కితకితలు పెట్టిన పప్పు pic.twitter.com/VuogNzf7DW
— Political Punch (@PoliticalPunch9) July 21, 2023