Nara Lokesh :
‘కుమారా.. లోకేశా.. నీ హామీలతో టీడీపీని మట్టిలో కలిపేలా ఉన్నావే’. అంటూ ఏపీ టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడి కొడుకు నారా లోకేశ్ రాజకీయంలోకి అడుగుపెట్టిన తర్వాత టీడీపీకి కలిసి రావడం లేదు. తండ్రి ఒక మాట చెప్తే కొడుకు ఒక మాట చెప్తున్నాడని ఆంధ్రప్రదేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. లోపాలు చెప్పకుండా పథకాలు తొలగిస్తాం.. తీసేస్తాం.. కనిపించ కుండా చేసేస్తాం.. అంటూ ఉత్తర కుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నాడని ఏపీ ప్రజలు కొంచెం గుస్సాగానే ఉన్నారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేశాడని ఏపీ మొత్తానికి తెలుసు ఆయన కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడిన తీరు చూస్తుంటే నవ్వస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలు ‘జగనన్న విద్యా దీవెన’, ‘జగనన్న వసతి దీవెన’. ఈ రెండు పథకాలతో ఎంతో మంది పేద విద్యార్థులు ఆనందంగా చదువు కుంటున్నారు. ఇంటి వద్ద సరైన సౌకర్యం లేని పేదలు జగనన్న వసతి దీవెన కింద వసతి పొందుతూ పాఠశాల, కళాశాలల్లో విద్య అభ్యసిస్తున్నారు. ఈ పథకాల వల్ల ఏం నష్టమో చెప్పకుండా ఏకంగా నారా లోకేశ్ వాటిని రద్దు చేసేస్తాం అంటూ చెప్తున్నాడు. వైసీపీని ఎదుర్కోలేం అని ఏదైనా ఒకటి మాట్లాడితే సరిపోతుంది అని చెప్పాడా? అన్న కోణంలో ఏపీ టీడీపీ శ్రేణులు, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యార్థుల కోసం వచ్చిన పథకాలు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు. ఈ పథకాలతో చాలా మంది పేద విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. అన్నింటికంటే ఈ పథకాలకు మంచి గుర్తింపు వచ్చింది. వాటితో ప్రయోజనం ఎక్కువని తెలిసింది. అయినా నారా లోకేశ్ మాత్రం ఈ రెండు పథకాలను తొలగిస్తాం అంటూ హామీలు ఇస్తున్నాడు. ఈ పథకాలతో ఎక్కువ మంది ప్రయోజనం పొందుతున్నారు. వీటని ముట్టుకుంటే టీడీపీ కాలిపోవాల్సిందే అంటూ వాదనలు సైతం వినిపిస్తున్నాయి. కుమార నువ్వు ఉత్తిగ ఉన్నా ఫర్వాలేదు. కానీ ఇలాంటి హామీలు ఇచ్చి టీడీపీని నువ్వే ఓటమి పాలు చేసేలా ఉన్నావు. అంటూ ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/sweety_00099/status/1681850497815441408?s=20






