
పురాణాల్లోని విలన్ల పేర్లతో వస్తున్న సినిమాలు ఈ మధ్య బాగా హిట్ అవుతున్నాయి. గతంలో ‘జై లవ కుశ’లో జై పేరు రావణాసురుడు. ఇందులో ఆయన విలన్ క్యారెక్టర్ వేసినా తన ఇద్దరు తమ్ముళ్లను కాపాడుకునేందుకు చివరికి చనిపోయి హీరో అవుతాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘రావణాసుర’ రవితేజ నటించిన ఈ సినిమా మెడికల్ డ్రగ్ మాఫియా అంతానికి రావణాసురుడిగా మారిన హీరో వారిని మట్టుపెడతాడు. ఇలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పేర్లు పురాణాల్లో విలన్ల పేర్లే.
పాన్ ఇండియాల లెవల్ లో వస్తున్న మరో సినిమా ‘నరకాసుర’. ఈ సినిమా ట్రైలర్ రెండు రోజుల క్రితం విడుదలైంది. భారీ వ్యూవ్స్ తో దూసుకు పోతోంది. దీనికి సంబంధించి టీజర్ కూడా గతంలో విడుదలైంది. ట్రైలర్ స్ట్రాటింగ్ లో శివుడి త్రి శూలం చూపిస్తారు. అంటే కథ అంతా శివుడి చుట్టూ తిరుగుతుందనుకుంటా.. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యాక్షుడు ఆయన రాక్షరసుల రాజు. ఆయన రక్తం నేల రాలడంలో దాంతో భూమి గర్భందాల్చి ఒక ‘నరకాసురుడు’కు జన్మ ఇచ్చినట్లు చూపుతారు.
కర్కోటకుడు అయిన నరకాసురుడు భూమిపైకి వచ్చి మంచి కోసం పాటుపడుతుంటాడు. అయితే ఆయన పక్కనే ఉన్న కొందరు మారనహోమం సృష్టిస్తుండడంతో అంతం చేసేందుకు శివుడే భూమికి దిగివస్తాడని తెలుస్తోంది. పరమశివుడు-నరకాసురుడి మధ్య హోరాహోరీ యుద్ధమే జరుగుతుందని తెలుస్తోంది. తెలుగు, హిందీ, మళయాలం, తమిళం, కన్నడ భాషలతో పాటు పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నట్లు యూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి దర్శకత్వం సెబాస్టియన్ నోహ అకోస్టా జూనియర్ వహిస్తుండగా, ఏఆర్ అజ్జా శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఏఐఎస్ నౌఫాల్ రాజా అందించారు. కాగా హీరోగా రక్షిత్ అట్లూరి, అపర్ణా జనార్దన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.






