
Malli Pelli movie review : తారాగణం: సీనియర్ నరేశ్, పవిత్ర లోకేశ్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగెళ్ల, అన్నపూర్ణ, భద్రం తదితరులు.
డైరెక్టర్: ఎంఎస్ రాజు
ప్రొడ్యూసర్: నరేశ్
సంగీతం: సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటింగ్: జునైద్ సిద్ధికీ
ఇండస్ట్రీలో నెగెటివ్ పబ్లిసిటీతో ఫేమ్ అయిన జంట సీనియర్ నరేశ్, పవిత్ర లోకేశ్. ఇంత ఓల్డ్ వయస్సులో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ వీరు ఇండస్ట్రీలో తీవ్ర అలజడి సృష్టించారు. ఒక వేళ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నరేశ్ కు ఇది నాలుగో పెళ్లి కాగా పవిత్ర లోకేశ్ కు రెండో పెళ్లి అవుతుంది. అయినా ఇద్దరి మధ్యా దాదాపు 20 సంవత్సరాల తేడా ఉంటుంది. వీరు కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నరేశ్ మూడో భార్య రమ్యా రఘుపతి మాత్రం వీరిని వ్యతిరేకిస్తూ వస్తుంది. తాను నరేశ్ కు విడాకులు ఇచ్చేది లేదని మీడియా ముందుకు వస్తూనే ఉంది. నరేశ్ కూడా పవిత్రా లోకేశ్ ను విడిచిపెట్టేది లేదని చెప్తూనే ఉన్నాడు. ఇవన్నీ పక్కనుంచితే ప్రస్తుతం వారిద్దరూ నటించిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రం ఈ రోజు (మే 26 శుక్రవారం) విడుదలైంది. ఈ సినిమా రివ్యూను ఇక్కడ చూద్దాం.
స్టోరీ
నరేశ్, పవిత్రా లోకేశ్ ఇద్దరి జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమాకు తెరకెక్కించారు. అంటే నరేశ్ తను మూడో పెళ్లి ఎందుకు చేసుకున్నాడు. ఎందుకు రమ్యను విడిచిపెట్టాడు..? పవిత్ర తన ఫస్ట్ భర్తను వదిలేయ వలసిన కారణం ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ఈ మూవీ తెరకెక్కించాడు దర్శకుడు. అయితే సినిమాలో కనిపించిన సన్నివేశాలు నిజమో కాదో తెలియదు గానీ. వారి జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులు మాత్రం ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు.
విశ్లేషణ
సినిమా మొదటి భాగంలో నరేశ్, పవిత్ర లోకేశ్ మధ్య లవ్ సీన్స్ ఉంటాయి. నరేశ్ మూడో భార్య రమ్య పాత్రను వనితా విజయ్ కుమార్ నటించారు. అయితే సినిమాలో నా పాత్రను దర్శకుడు నెగెటివ్ వేలో చూపించాలని అనుకుంటున్నాడు అంటూ రమ్య రఘుపతి ఇటీవల కోర్టును కూడా ఆశ్రయించింది. ఇటు నరేశ్ నుంచి అటు పవిత్ర నుంచి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాడు దర్శకుడు ఎంఎస్ రాజు. ఇక చివరికి చిత్రాన్ని ఎలాగోలా విడుదల చేశారు. అయితే ఇంటర్వెల్ కు ముందు 30 నిమిషాలు ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను బాగా చిత్రించాడు దర్శకుడు. సినిమా లాగ్ ఎక్కువైందన్న కామెంట్లు కూడా ఉన్నాయి. కానీ బయోపిక్ కాబట్టి మరొకరి జీవితాల్లో తొండిచూసే సన్నివేశాలు కాబట్టి కొంత ఇంట్రస్టింగ్ అనిపిస్తుంది.
చివరి మాట
సీనియర్ నరేశ్ పవిత్ర లోకేశ్ లవ్ స్టోరీ తెలుసుకోవాలి అనుకునే వాళ్లకు సినిమా నచ్చచ్చు. కొన్ని సీన్స్ లాగ్ అనిపించినా ఒక సారి మాత్రం చూసేలా ఉంది చిత్రం.
రేటింగ్ : 2.25/5