NATA Food :
నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా)-2023 వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. డల్లాస్ లోని కే బెయిలీ కన్వెన్షన్ సెంటర్ లో ఇందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు విందుతో కార్యక్రమాలు మొదలయ్యాయి. యూఎస్ లో నుంచే కాకుండా ఇండియా నుంచి వచ్చిన అతిథులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. దాదాపు 4 వేల మందికి పైగా విందులో పాల్గొని సందడి చేశారు. అమెరికా స్వాతంత్ర దినోత్సవ వారాంతం కావడంతో ప్రవాసాంధ్రులు వేడుకకు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. నాటా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొరసపాటి, కన్వీనర్ ఎన్ఎంఎస్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.
వేడుకలను ఉద్దేశిస్తూ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మరింత వైవిధ్యంగా ఉండేలా కార్యక్రమాలను రూపొందించామని తమకు వెన్నుదన్నుగా ఉన్న డా. ప్రేమ్ సాగర్ రెడ్డికి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వైకాపా సోషల్ మీడియా సభ్యుడు సజ్జల భార్గవ్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, దర్శకుడు రాం గోపాల్ వర్మ, నటీనటులు ఆలీ, లయ, అనంత శ్రీరామ్, చిన్నా వాసుదేవరెడ్డి, ఎస్పీ శైలజ వేడుకలకు హాజరయ్యారు. అనూప్ రూబెన్స్ ఆధ్వర్యంలో సంగీత విభావరి అక్కడి వారిని అలరించింది.
ఈ మహాసభల్లో పలు రంగాల్లో సేవలందించిన వారికి పురస్కారాలు అందజేశారు ప్రముఖులు. గట్టు జగదీశ్వర్, డా. ఖాదర్ వలీ, డాఎస్వీ రామారావు, బాల ఇందుర్తి, త్రివిక్రమరెడ్డి, డా.పైడిపర్తి జగన్మోహనరావు, నరాల రామిరెడ్డి, సాయితేజరెడ్డి, అప్పిరెడ్డి హరనాథరెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, డా.యూ నరసింహా రెడ్డి, డా.గంగిరెడ్డి రామసుబ్బారెడ్డి, చిల్లర శ్రీధర్, కొండా వేణుగోపాలరెడ్డి, పుచ్చలపల్లి వెంకట సత్య, ఆవుల ఈష, మరీదు మాధవీలత తదితరులు ఉన్నారు.
ఇక బ్యాంక్విట్ విందులో నాటా ఫౌండర్ డా.ప్రేమ్‌సాగర్ రెడ్డి, తానా (TANA) నుంచి కొల్లా అశోక్‌బాబు, డా. తోటకూర ప్రసాద్, ముత్యాల పద్మశ్రీ, తాళ్లూరి జయశేఖర్, పోలవరపు శ్రీకాంత్, దిలీప్ చండ్ర, యార్లగడ్డ వెంకటరమణ, గారపాటి ప్రసాద్, నాట్స్ నుంచి బాపు నూతి, రాజేంద్ర మాదాల, కంచర్ల కిశోర్, ఆటా నుంచి మధు బొమ్మినేని, శారద సింగిరెడ్డి, పరమేశ్ భీంరెడ్డి, కొండా రామ్మోహన్, ప్రవీణ్, వంగూరి చిట్టెన్‌రాజు, జీటీఏ నుంచి కలవాల విశ్వేశ్వర్ రెడ్డి, డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రవాస యువతీయువకుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అతిథులకు పలు రకాలతో విందు ఏర్పాటు చేశారు.






