27.7 C
India
Saturday, May 17, 2025
More

    Jammu Kashmir : జమ్మూకాశ్మీర్ పాఠశాలల్లో జాతీయ గీతం – విద్యాశాఖ కీలక నిర్ణయం

    Date:

    Jammu Kashmir
    Jammu Kashmir Schools

    Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో రోజూ ఉదయం జాతీయ గీతం పాడటాన్ని తప్పనిసరి చేశారు. విద్యార్థుల చేత జాతీయ గీతం తప్పనిసరిగా పాడించేలా చూడాలని పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక సర్క్యులర్ జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో ఉదయం పాఠాలు ప్రారంభించే ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకచోట గుమిగూడి జాతీయ గీతాన్ని పాడటంతో పాటు పలు అంశాలపై చర్చించాల్సి ఉంటుంది. ఈ సమావేశం 20 నిమిషాల పాటు కొనసాగాలని సర్క్యులర్‌లో తెలిపారు.

    ఈ సమావేశంలో గొప్ప వ్యక్తులు, స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మకథలను చర్చించాలని, విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారిలో దేశభక్తిని పెంపొందించడానికి, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇంకా విద్యార్థులకు మానసిక బలం కలిగించేలా సాంస్కృతిక వేడుకలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒత్తిడి నిర్వహణ, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, విభిన్న సంస్కృతులు, చారిత్రక సంఘటనలు, మొదలగు 16 అంశాలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉదయం పాఠశాలలు ప్రారంభించే ముందు జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరిగా ఉండగా ఈ పద్ధతి  పాటించడం లేదని గుర్తించిన అధికారులు తాజాగా కొత్త సర్క్యులర్‌ను జారీచేశారు.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pakistan : పాకిస్తానీలకు భారత్‌లో నేడే డెడ్‌లైన్: ఏం జరుగుతోంది?

    Pakistan : దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీ పౌరులకు నేడు కీలకమైన రోజు. కేంద్ర...

    Prime Minister Modi : టెర్రర్ అటాక్.. ప్రధాని మోదీ కీలక సమావేశం

    Prime Minister Modi : జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై...

    Pahelgam attack : పహెల్గామ్ దాడి: ఐబీ అధికారి, వైజాగ్ వాసి దుర్మరణం

    Pahelgam attack : కాశ్మీర్‌లోని పహెల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో దేశం దిగ్భ్రాంతికి...

    PM Modi : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి: ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష

    PM Modi Review : జమ్మూ కాశ్మీర్ లో జరిగిన తాజా ఉగ్రదాడిని...