Rashmika Mandana : ‘ఛలో’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తార రష్మిక మందాన. ఆమె కెరీర్ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. రీసెంట్ గా వచ్చిన యానిమల్ లో ఆమె నటనకు విమర్శకులే విస్తు పోయారు. ఆమె నటిస్తే మామూలుగా ఉండదు అంటూ కీర్తిస్తున్నారు. దీని కంటే ముందు వచ్చిన పుష్ప కంటే కూడా ఈ సినిమాలో ఆమె నటనను మెచ్చుకోవచ్చు. అయితే, యానిమల్ బాక్సాఫీస్ హిట్ కావడంతో రెమ్యురేషన్ బాగా పెంచేసిందని సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఆమె స్పందించింది. ఆ వివరాలను తెలుసుకుందాం.
‘గీత గోవిందం’తో తెలుగు కుర్రకారుల మనస్సును కొల్లగొట్టిన ఈ కూర్గ్ భామ.. యానిమల్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. రణ్ బీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. గర్ల్ ఫ్రెండ్ నుంచి కోడలి వరకు అన్ని పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించింది. స్టార్ హీరోలు కూడా కనిపించకుండా తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత నుంచి ఆమెకు అవకాశాలు ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలో యానిమల్ తర్వాత రష్మిక రెమ్యునరేషన్ పెంచేసిందని వార్తలు వస్తున్నాయి. రూ. 4 నుంచి రూ. 4.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోరుతుందని టాక్ వినిపిస్తుంది. ఇటు సోషల్ మీడియా వెబ్ సైట్లతో పాటు అటు మేయిన్ స్ట్రీమ్ మీడియా అయిన పేపర్లు, టీవీల్లో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ‘ఫిల్మీ బౌల్’ అనే ఓ ట్విట్టర్ అకౌంట్ లో యానిమల్ తర్వాత ష్మిక రెమ్యునరేష్ ను రూ. 4 నుంచి రూ. 4.5 కోట్లకు పెంచేసిందని రాసుకొచ్చారు. దీనిపై రష్మిక గట్టిగా స్పందించింది.
ట్విటర్ (ఎక్స్)లో వచ్చిన పోస్ట్ కు రిప్లయ్ ఇస్తూ.. ‘ఈ విషయం నీకు ఎవరు చెప్పారు. నాకే తెలియని విషయం నీ వరకు రావడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వార్తలు అన్నీ చూసిన తర్వాత నేను నా రెమ్యునరేషన్ గురించి ఆలోచించుకోవాలి. నిర్మాతలు ఎందుకు ఇంత రెమ్యునరేష్ పెంచావంటే.. మీడియా అలాగే చెబుతుంది సార్.. నేను వారి మాటలకు గౌరవించాలని అనుకుంటున్నా.. నేనేం చేయాలని అడుగుతా’ అంటూ స్పష్టం చేసింది.
రష్మిక ఇచ్చిన రిప్లయ్ చూస్తేనే ఆమె తన పారితోషికాన్ని పెంచలేదని అర్థం అవుతుంది. ఇవన్నీ పుకార్లేనని తెలుస్తోంది. తనగురించి తప్పుడు వార్తలు రాయద్దని రష్మిక గట్టిగా స్పందించిన విధానం చూసి నెటిజెన్లు సపోర్ట్ చేస్తున్నారు.