
NATS Celebrations : అమెరితో పాటు తెలుగు వారు ఎప్పుడెప్పుడా అని ఎదిరి చూస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 7వ అమెరికా తెలుగు సంబురాలు శుక్రవారం (మే 26)న ప్రారంభమ్యాయి. న్యూ జెర్సీలోని ఎడిషన్ లో ఉన్న న్యూజెర్సీ కన్వెన్షన్ అండ్ ఎక్పోజిషన్ సెంటర్ ఈ వేడుకలకు వేధికగా మారింది. తొలిరోజు వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సభా ప్రాంగణం అంతా తెలుగు వారి సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. తెలుగు వారి ఆట, పాట, సంప్రదాయాలు కనిపించేలా కార్యక్రమాలను డిజైన్ చేశారు. ఇందులో పాల్గొనేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు ఎడిషన్ కు చేరుకున్నారు.
రెండు సంవత్సరాలు కొవిడ్ వల్ల ఈ సమావేశాలు అంతగా జరగకపోవడంతో ఈ సారి మరింత వైవిధ్యంగా నిర్వహించాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సారి సమావేశంలో ‘సంపూర్ణ మహిళా అష్టవధానం’ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇండియా నుంచి వెళ్లిన తెలుగు వారిని అమెరికాలో ఉన్న వారు సాదరంగా ఆహ్వానించారు. వేదిక వరకూ ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పించారు నాట్స్ నిర్వాహకులు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సంబురాలలో మొదటి రోజు శుక్రవారం (మే 26) రోజు అద్భుతంగా, వైవిధ్య భరితమైన ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. నాట్స్ ఉత్సవాలు మొదటి రోజు బాంక్వెట్ విందుతో ప్రారంభమైంది. తెలుగువారితో పాటు ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు. తర్వాత అమెరికాలో ఉన్న తానా, ఆటా, నాటా, మాటా తెలుగు సంఘాల ప్రతినిధులు తమ సందేశాలను వినిపించారు. ఈ రోజు సభా వేధికగా పలు రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి పురస్కారాలు అందజేశారు.
మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయని, సంగీతం, డ్యాన్స్, అష్టావధానం తదితర ప్రొగ్రామ్స్ తో పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. మణిశర్మతో మ్యూజిక్ కాన్సెర్ట్ ఉంటుందని ఈ కార్యక్రమాలతో తెలుగువారు సందడిగా గడపాలని నాట్స్ నిర్వాహకులు వేడుకలకు వచ్చిన వారిని కోరారు.