Home EXCLUSIVE NATS – Coffee with Cops Event : నాట్స్ ఆధ్వర్యంలో ‘‘కాఫీ విత్ కాప్స్’’.....

NATS – Coffee with Cops Event : నాట్స్ ఆధ్వర్యంలో ‘‘కాఫీ విత్ కాప్స్’’.. యూఎస్ ఎడిసన్ లో భారతీయుల భద్రతకు చర్యలు

90

NATS – Coffee with Cops Event : నాట్స్ ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ‘కాఫీ విత్ కాప్స్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. అమెరికాలో భారతీయుల భద్రతకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపేలా ఈ కార్యక్రమాన్ని నాట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గతంలో పలు ఘటనలు జరిగిన విషయం మనకు తెలిసిందే. అమెరికాలోని పలు నగరాల్లో భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. వారందరి రక్షణకు అక్కడి ప్రభుత్వాలతో పాటు నాట్స్ , ఎన్ఆర్ఐల సంఘాలు కృషి చేస్తున్నాయి. అమెరికా ఆర్థికాభివృద్ధిలో భారతీయులు నిజాయితీ, నిబద్ధతగా కష్టపడి పనిచేస్తూ భాగస్వామ్యులు అవుతున్నారు. ఈక్రమంలో అక్కడి ప్రభుత్వాలు కూడా భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాయి.

ఈనేపథ్యంలో ఈనెల 22న(శుక్రవారం) సాయంత్రం 5.30గంటల నుంచి 7.30గంటల వరకు ఎడిసన్ నగరంలో ‘కాఫీ విత్ కాప్స్’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ శ్యామ్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్యామ్ జోషి భారత్ కు చెందినవారు కావడం విశేషం. ఎడిసన్ నగరానికి తొలి భారతీయ మేయర్  శ్యామ్ జోషి. ఆయన నగరంలో భారతీయుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నారు. దీని కోసం అక్కడి పోలీసులతో భారతీయుల భద్రతకు ‘కాఫీ విత్ కాప్స్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

‘కాఫీ విత్ కాప్స్’ కార్యక్రమాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నార్త్ అమెరికా తెలుగు సొసైటీ- నాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించారు. మేయర్ శ్యామ్ జోషి సూచనల మేరకు ‘కాఫీ విత్ కాప్స్’ కార్యక్రమానికి హాజరైన ఇద్దరు పోలీసు అధికారులు ఎడిసన్ కు చెందిన సుమారు 200మంది భారతీయులతో చర్చాగోష్టి నిర్వహించారు. దీనిలో భారతీయుల భద్రతకు సంబంధించి వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు.

ఇంటర్నెట్ ఫ్రాడింగ్ తో పాటు చుట్టుపక్కల వారితో ఎలా మెలగాలి.. అగంతకుల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలి.. దొంగల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. స్కూల్ పిల్లలు దుండగుల బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి.. ఇలా పలు భద్రతా చర్యలపై కూలంకషంగా చర్చించారు. ఎడిసన్ మేయర్ శ్యామ్ జోషి చేపట్టిన ఈ కార్యక్రమంపై పలువురు ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ బాపయ్య చౌదరీ నూతి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శ్రీహరి మందాడి, టీపీ రావు, బిందు ఎలమంచిలి, మురళీ మేడిచెర్ల (ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మీడియా), అరుణ గంటి (గత చైర్ ఉమెన్) తదితరులు పాల్గొన్నారు.

Photos courtesy of Dr. Sivakumar Anand, Global Director of Jaiswarajya TV, Jaysw TV

Walkins are welcome. Please register at: https://forms.gle/LEr281L8s7wwgtYk6

All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)