
Natures Fury : సమస్త జంతుజాతులు ప్రకృతి నియమాలకు లోబడి జీవించాలి. ఇది జీవిత చక్రం కాదని ప్రకృతితో ఆడుకుంటే మాత్రం అది కూడా ప్రకోపిస్తుంది. ప్రకృతి ప్రకోపానికి గురైతే సమస్త జీవరాశి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని చరిత్రను పరిశీలిస్తే ఇట్టే అర్థం అవుతుంది.
మనిషి తన మనుగడ కోసం సౌకర్యాలను విస్తరించుకుంటూ పోయే నేపథ్యంలో ప్రకృతిని విస్మరిస్తున్నాడు. దీంతో ప్రతీ సారి విపత్తులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ప్రకృతి తల్లిలాంటిది తనకు ఎంత కీడు చేస్తున్నా ఓపికతో సహనంతో వ్యవహరిస్తుంది. కానీ తను ఒక్కసారి కట్టలు తెంపుకుందా.. ఇక ఆపడం ఎవరి వల్లా కాదు. ఇలాంటి పరిణామాలు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే ఉండిపోవు.
చెట్లను విపరీతంగా నరకడం వల్ల కార్బన్ డై యాక్సైడ్ విపరీతంగా పెరిగిపోవడం, వర్షాలు కనుమరుగయ్యాయి. ఆ తర్వాత ప్రపంచం తేరుకొని చెట్ల పెంపకాన్ని చేపట్టింది. దీంతో వాతావరణం సమతుల్యతకు వచ్చింది. అంతెందుకు గతంలో జరిగిన సమావేశాల్లో వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ పై ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేసింది. పట్టించుకోకుంటే సమస్త జీవరాశి ఇబ్బందులు పడడం ఖాయమని హెచ్చరించింది. దీంతో ప్రపంచం యావత్తు గ్లోబల్ వార్మింగ్ పై శ్రద్ధ పెట్టాయి. దీంతో ఇటీవలి కాలంలో కొంత వార్మింగ్ తగ్గుకుంటూ వస్తోంది.
వీటితో పాటు ప్రకృతిని తొలిచి రహదారులు, ఇళ్లు నిర్మిస్తే ఎప్పటికైనా ముప్పు తప్పదు. ఇటీవల టిబెట్ లోని చవే హైవేపై పర్వతం కూలిపోయింది. ప్రకృతి ఇంత భయంకరమైన విపత్తు తీసుకురావడంతో ఆ రోడ్డు గుండా వెళ్లేవారు హతాశ్రయులయ్యారు. పర్వతాలు, కొండలు, గుట్టలను తొలచి రోడ్లు వేయడం, ఇళ్లు నిర్మించడం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ప్రాణాపాయం తప్పదు మరి.