Naveen Polishetty : నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో తెలుగులో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. కానీ అంతకు ముందే చాలా తెలుగు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హిందీలో మాత్రం యూట్యూబ్ లో చేసిన సిరీస్ లు నవీన్ పొలిశెట్టికి మంచి పేరు తెచ్చాయి. ముంబై యాసతో చేసిన షార్ట్ ఫిలింలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. కానీ తెలుగులో మాత్రం గుర్తింపు రావడానికి మాత్రం చాలా టైమ్ పట్టింది.
ఆచితూచి అడుగులు
జాతిరత్నాలు సినిమా విజయవంతం కావడంతో నవీన్ పొలిశెట్టికి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. కానీ వచ్చిన ప్రతి సినిమాను అంగీకరించకుండా ఆచితూచి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. జాతి రత్నాలు తర్వాత అనుష్క శెట్టి తో కలిసి మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి అనే సినిమా చేశాడు. ఆ సినిమా పర్వాలేదనిపించకున్నది. ఆ తర్వాత చేతికి గాయం కావడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో దర్శకులు, నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నాడు.
గీతా ఆర్ట్స్ తో టై అప్
గీతా ఆర్ట్స్ 2 ఇటీవల ఆయ్ అనే సినిమాను నిర్మించింది. లో బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది. కమర్షియల్ సినిమా ఆడడంతో నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా దర్శకుడు అంజి అదే బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆయ్ సక్సెస్ కావడంతో అంజితో సినిమాల చేసేందుకు నిర్మాతలు వెంట పడుతున్నారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం గీతా ఆర్ట్స్ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు అంజి. ఈ సినిమాలో హీరోగా నవీన్ పొలిశెట్టి చేయబోతున్నాడని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నాడట దర్శకుడు అంజి.