
Nayanthara TV host : నయనతార గురించి స్పెషల్ పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి.. ఈమె ముందు నుండి నటన పరంగా అద్భుతమైన అభినయాన్ని కనబరుస్తుంది. ఏ పాత్రలో అయిన ఈమె చేస్తే ఆమె నేతకు వంకలు పెట్టడానికి కూడా ఉండదు.. అందుకే ఈమెకు అంత డిమాండ్.. నాలుగు పదుల వయసుకు చేరువవుతున్న ఈమె అందం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు..
లేడీ సూపర్ స్టార్ గా ఈమె ప్రేక్షకుల చేత పిలిపించు కుంటుంది.. ఈ పేరుతోనే అర్ధం అవుతుంది ఈమె ఎంత ఎత్తుకు ఎదిగిందో.. ప్రజెంట్ సౌత్ ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈమె ఒకప్పుడు ఒక చిన్న టీవీ ప్రోగ్రాం కు హోస్ట్ గా చేసింది అని మీకు తెలుసా.. ఈమె కెరీర్ ముందుగా బుల్లితెర మీదనే స్టార్ట్ అయ్యింది..
ఈ విషయం చాలా మందికి తెలియదు.. కొన్ని రోజుల పాటు ఈమె ఒక టీవీ యాంకర్ గా పనిచేసింది. అప్పటి ప్రోగ్రాంలో హోస్ట్ గా చేసిన నయన్ ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది. నయనతార తన పుట్టిన పేరు ‘డయానా’ అనే పేరుతో హోస్ట్ గా చేసింది.. ఈ షో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్.. ‘చమయం’ అనే టీవీ షోతో అరంగేట్రం చేసిన నయన్ ఆ తర్వాత నయనతార గా పేరు మార్చుకుని ఫేమస్ అయ్యింది.