39.4 C
India
Saturday, June 6, 2026
More

    NDA Victory Celebrations : న్యూజెర్సీలో ఏన్డీఏ విక్టరీ సెలబ్రేషన్స్.. ఎన్ఆర్ఐల్లో ఫుల్ జోష్

    Date:

    NDA Victory Car Rally 2024 : ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం పై దేశవిదేశాల్లో తెలుగు తమ్ముళ్ల సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికాలోనైతే ఈ సంబరాలు పీక్స్ లో జరుగుతున్నాయి. జగన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించిన సందర్భంగా అమెరికా ఎన్ఆర్ఐలు గత నాలుగు రోజులుగా సంబరాలు జరుపుకుంటూనే ఉన్నారు.

    న్యూజెర్సీ ఎడిసన్ సిటీలోని జాన్సన్ పార్క్ లో యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీశ్ యలమంచిలి గారి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎన్డీఏ విక్టరీ సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ విక్టరీ కార్ ర్యాలీ తీశారు. దీనికి న్యూజెర్సీలో స్థిరపడిన వందలాది టీడీపీ, జనసేన అభిమానులు హాజరయ్యారు. ర్యాలీలో జై టీడీపీ…. జైజై చంద్రబాబు… జై జనసేన…జై జై పవన్ కల్యాణ్ అంటూ పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు.

    ర్యాలీ అనంతరం యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీశ్ యలమంచిలి గారు భారీ కేక్ ను కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ..జగన్ రెడ్డి పాలన అంతమవుతుందని తాను ఆరు నెలలు ముందుగానే చెప్పానన్నారు. ఏపీ భవిష్యత్ కు చంద్రబాబు, భారత్ భవిష్యత్ కు మోదీ అవసరమని ప్రజలు మరోసారి గుర్తించారన్నారు. టీడీపీ కూటమి ఘన విజయంలో మూడు పార్టీలకు చెందిన నేతలు, నాయకులు, కార్యకర్తలు..ఇలా అందరి విశేష కృషి ఉందన్నారు. అలాగే మన ఎన్ఆర్ఐల పాత్ర విశేషంగా ఉందన్నారు.

    కాగా, వేడుకలను చూస్తే ఆంధ్రాలో ఉన్నామా? అమెరికాలో ఉన్నామా? అనిపించడం ఖాయం. చంద్రబాబు మరోసారి సీఎం అవుతుండడంతో ప్రతీ ఒక్కరి కళ్లలో ఆనందం కనిపిస్తోంది. టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం, కేంద్రంలో చంద్రబాబు మరోసారి కింగ్ మేకర్ గా అవతరించడంతో ఏపీకి మంచి రోజులు వచ్చాయని ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

     

    Image Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

    More Images : NDA Victory Car Rally 2024 at Johnson Park Piscataway NJ

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Jai Yalamanchili : సాయంలో కర్ణుడు.. సేవలో మేరునగధీరుడు.. డా.జై

    UBlood Founder Dr. Jai Yalamanchili Garu : పువ్వు పుట్టగానే...

    Rahul Gandhi : అమెరికాలో రాహుల్ గాంధీ సమావేశానికి హాజరైన యూబ్లూడ్ ఫౌండర్ డాక్టర్ జై

    Rahul Gandhi :కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ప్రస్తుతం...