
Neelima Manne : తానా ఎన్నికల్లో డెట్రాయిట్ వాసి నీలిమ మన్నె విజయం సాధించారు. 18 సంవత్సరాల తరువాత తానా నార్త్ ప్రతినిధిగా తిరిగి మహిళ ఎన్నిక కావడం గమనార్హం. ప్రస్తుత తానా అధ్యక్షుడి ప్రాంతంలో ప్రత్యర్థిని సునాయాసంగా ఓడించడం మామూలు విషయం కాదు. గతంలో నీలిమ మన్నె డెట్రాయిట్ తెలుగు సంస్థ అధ్యక్షురాలిగా కాకుండా టీటీఏ 40 వసంతాల వార్షికోత్సవంలోనూ ధీంతానా కోఆర్డినటర్, నార్త్ మహిళా విభాగ కోఆర్డినేటర్ గా సేవందించడం తెలిసిందే.
తానా మహిళా సభ్యులంతా నీలిమను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. నీలిమ ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని చెబుతున్నారు. మహిళల అభ్యున్నతికి, వారి అవసరాలు తీర్చడానికి పాటుపడతానని చెప్పారు. జులై 2023లో పెద్దమనుషుల ఒప్పందాన్ని గౌరవించి తన నామినేషన్ ఉపసంహరించుకున్నా కోర్టు కేసుల వల్ల ఎన్నికల్లో పోటీ చేశారు.
ఏదిఏమైనా తానా ఎన్నికల్లో విజయం సాధించడం ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. అమెరికాలో మహిళా ప్రతినిధిగా తన సేవలు అందిస్తానని తెలియజేసింది. మహిళలకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి నిలుస్తానని పేర్కొంది. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని తెగేసి చెప్పింది. 24 గంటలు వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధమేనని వెల్లడించింది. దీంతో నీలిమ మన్నె మునుముందు మరిన్ని విజయాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.